Jio 10th Anniversary Offer: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యూజర్లకు ఆకర్షణీయమైన ప్లాన్లు, ప్రత్యేక బెనిఫిట్లను ప్రకటించింది. ఎంపిక చేసిన జియోహోమ్ (JioHome) వినియోగదారులకు ఏడాది పాటు ఉచితంగా ‘అమెజాన్ ప్రైమ్ లైట్’ (Amazon Prime Lite) సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నట్లు వెల్లడించింది. 30Mbps,100Mbps ఇంటర్నెట్ వేగంతో ఉండే ‘3-ఇన్-1 జియోహోమ్ ప్లాన్లు’ (TV + OTT + Wi-Fi) తీసుకున్న వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించనుంది.
అమెజాన్ ప్రైమ్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను మైజియో (MyJio) యాప్‌లోని హోమ్ పేజీలో కనిపిచే క్లెయిమ్ బానర్ (Claim Banner) ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే రాబోయే రెండు వారాల్లో దశలవారీగా ఈ ఆఫర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కాగా, రూ.888, రూ. 1,199, 150 Mbps కంటే ఎక్కువ వేగం ఉన్న ప్లాన్‌లపై ప్రస్తుతం ఉన్న 24 నెలల అమెజాన్ ప్రైమ్ లైట్ ప్రయోజనం యథావిధిగా కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది.
జియో తన 10వ వార్షికోత్సవ కానుకగా రూ. 3,599 ధరతో ప్రత్యేక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5GB డేటా (మొత్తం 912.5 GB) అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. దీంతో పాటు పలు ప్రత్యేక సేవలను ఉచితంగా పొందే అవకాశం యూజర్లకు లభిస్తుంది. ఫ్రీగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, ప్రతి నెలా 10GB చొప్పున మొత్తం 120GB అదనపు డేటా, 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్, 1000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లతో కూడిన రూ.600 విలువైన ‘జియోటీవీ ప్రో’ (JioTV Pro) ప్యాక్.. ఈ ప్లాన్ కింద యూజర్లు పొందొచ్చు.
Also Read: బ్రాండెడ్ vs జనరిక్.. తక్కువ ధరకే లభించే జనరిక్ మందులు.. నిజంగా పనిచేస్తాయా?
రూ.3,599 ప్లాన్ కింద మరికొన్ని అదనపు బెనిఫిట్స్ ను జియో ఆఫర్ చేస్తోంది. రూ.35,100 విలువైన ‘గూగుల్ జెమిని ప్రో’ ప్లాన్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను 18 నెలల పాటు ఉచితంగా పొందొచ్చు. వినియోగదారులకు 5TB (5,000GB) గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. నానో బనానా, జెమిని 3.1 ప్రో, 1-మిలియన్ టోకెన్ కాంటెక్స్ట్ విండో, డీప్ రీసెర్చ్, గూగుల్ ఫ్లో వంటి ఏఐ టూల్స్‌తో పాటు యూట్యూబ్ ప్రీమియం లైట్ ఉచితంగా అందుబాటులోకి వస్తాయి.
Also Read: సముద్రగర్భంలోని వింత జీవిని.. భూమిపై వదిలేసిన శాస్త్రవేత్తలు.. 455 రోజుల తర్వాత చూస్తే..!