trinayani serial today Episode: తన మీదకు కొట్టడానికి వచ్చిన తిలొత్తమ్మ చేతిని పురి తిప్పి పట్టుకుంటుంది నయని. దీంతో తిలొత్తమ్మ ఏడుస్తూ నయని నువ్వు నా కోడలివే.. నేను మీ అత్తయ్యనే నన్ను వదిలేయ్ అంటూ వేడుకుంటుంది. దీంతో నయని కూల్‌గా తిలొత్తమ్మ చేతులు వదిలేసి.. గాయత్రి పాపను ఎత్తుకుని లోపలికి వెళ్తుంది. గాయత్రి పాప తుంటరి పనులు చేస్తుంటే.. ఎలా అంటూ నీ చేతులు ఈ కర్చీప్‌తో కట్టివేస్తానని కడుతుంది. ఇంతలో విశాల్ వచ్చి ఈ సారికి క్షమించి వదిలేయ్ చిట్టి తల్లి చేతులు నొప్పి పుడతాయి కదా..? అంటూ పాప చేతులకు ఉన్న కర్చీప్ తీసేసి అమ్మకు సారీ చెప్పు అంటాడు పాప క్యూట్‌గా చూస్తుంది. ఇవన్నీ కాదు కానీ ముందు మీ కూతురుని బలంగా తయారవ్వమని చెప్పండి అంటుంది నయని. ఏం చేయడానికి బలంగా తయారవ్వాలని అడుగుతాడు నయని. ఏం లేదు రేపు ఏమైనా చేయాలంటే బలంగా తయారవ్వమని చెప్పండి అంటూ వెళ్లిపోతుంది నయని.
సుమన టెన్షన్ పడుతుంటే విక్రాంత్ వస్తాడు. ఏంటలా ఉన్నావని అడుగుతాడు. ఎలా ఉన్నాను అంటుంది సుమన. తోలు తీసిన గొర్రెలా అంటాడు విక్రాంత్.. నేను మీకలా కనిపిస్తున్నాను కానీ తిలొత్తమ్మ అత్తయ్య చేతులు ఎలా నులి తిప్పి పట్టుకుందో చూశావా..? అంటూ సుమన అనగానే దేవుడి కన్నా దెబ్బే గురువు అన్నట్టు మా వదిన దెబ్బకి నీకు అనుమానం తగ్గిపోయింది అనుకుంటా అంటాడు విక్రాంత్. ఇంకో అర్థం కాని విషయం ఏంటంటే తిలొత్తమ్మ అత్తయ్యను నువ్వు తిలొత్తమ్మవే కాదని మా అక్క ఎందుకు అడిగింది అని సుమన అడగ్గానే నువ్వు నిజమైన సుమనవేనా..? అంటూ విక్రాంత్ అడగ్గానే అర్థం అయింది అని చెప్తుంది సుమన.
నయని శారీ కట్టుకుంటుంటే విశాల్ వెనక నుంచి వెళ్లి హగ్ చేసుకుంటే వద్దని విశాల్‌ను దూరంగా నెట్టి వేస్తుంది నయని. ఎందుకు దూరంగా నెట్టివేస్తున్నావు ఎప్పుడైనా నేను హగ్ చేసుకుంటే.. వెన్నలా కరిగిపోయే దానివి ఇవాళ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడగ్గానే నేను నీ నయనినే బాబుగారు. కానీ ఈ శరీరం నాది కాదు అందుకే మీరు టచ్ చేయకూడదు అని మనసులో అనుకుంటూ విశాల్‌ను బలవంతంగా బయటకు పంపిచివేస్తుంది నయని.
శ్రీమంతం పనులు చేస్తున్న నయని మాటి మాటికి టైం చూస్తుంది. అది గమనించిన హాసిని ఎందుకు చెల్లి నీ చేతికి ఉన్న వాచ్‌ను చూస్తున్నావు అని అడుగుతుంది. వాచ్ ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. లేదు అక్కా నా టైంమే బాడ్ అని చెప్తుంది. మరోవైపు కిచెన్ లో ఉన్న తిలొత్తమ్మ పాయసంలో విషం కలుపుతుంటే వల్లభ వెళ్లి ఏం చేస్తున్నాము మమ్మీ అని అడుగుతాడు. ఇది కలిసితే ఇంకా టేస్ట్ పెరుగుతుందా..? అని అడుగుతాడు. దీంతో ఇది దురందర తిన్నాక తన కడుపులో ఉన్న ఫిండం కూడా కరిగిపోతుంది అని చెప్తుంది తిలొత్తమ్మ.
దీంతో వల్లభ షాక్ అవుతాడు. ఇంత నీచంగా ఆలోచించి అమలు చేస్తావని నేను అసలు అనుకోలేదు మమ్మీ అని తిడుతుంటాడు. ఆపు ఇది తింటే అలా అవుతుందని చెప్పాను కానీ తాను తింటుంది అని చెప్పానా..? చెప్పలేదు కదా..? ఎందుకంటే ఇది తినకపోతే నయని తింటుందా..? అని అడగుతాడు. అది కాదురా నయనిని పరీక్షించడానికే ఇదంతా చేస్తున్నానని తను నయని అయితే దురందర సేఫ్, కాకపోతే నయని స్థానంలోకి వచ్చిన దాన్ని బయటకు పంపించేసి మనం చైర్మన్ స్థానంలోకి వెళ్లిపోతాను అని తిలొత్తమ్మ వెళ్లిపోతుంది.
విశాల్, వల్లభ, సుమన హాల్లోకి వచ్చి పనులు పూర్తి అయ్యాయా..? అని అడుగుతారు. అయిపోయాయని చెప్తుంది నయని. ఇంతలో వల్లభ, తిలొత్తమ్మ వస్తారు. నయని ఏం చేసినా చాలా బాగా చేస్తుందని ముఖ్యంగా పాయసం చాలా బాగుందని చెప్తాడు. మీరప్పుడే దాన్ని రుచి చూశారా అని అడుగుతుంది హాసిని. ఇదంతా సరే కానీ ముందు అత్తయ్యను పిలవండి అని విశాల్ చెప్పగానే వస్తుంది అల్లుడు అని పావణమూర్తి చెప్పగానే దురందర వస్తుంది. ఫంక్షన్ కు అందరూ రెడీ చేస్తుంటారు. ఇంతటితో త్రినయని సీరియల్ నేటి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?