trinayani serial today Episode: నయని తలకు దెబ్బ తగిలి అలా మాట్లాడుతుందేమోనని నేను అనుకుంటుంటే.. నువ్వు కూడా తను నయని కాదని అంటున్నావేంటమ్మా అని విశాలాక్షిని అడుగుతాడు విశాల్. దీంతో విశాలాక్షి వీళ్లందరూ అనుకున్నట్టే కాసేపు అనుకుందాం నాన్నా అంటుంది. అవును బాబుగారు నేను త్రినేత్రిని అంటుంటే మీరు కూడా తనకు ప్రమాదం జరిగిందని అంటున్నారు. అయితే తను ఇప్పుడు ఎక్కడుండాలి అని నేత్రి అడుగుతుంది. హాస్పిటల్ లోనే ఉండాలి అని హాసిని అంటుంది. లేదని విశాలాక్షి చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. లేదా.. అని తిలొత్తమ్మ.. లేకపోవడం ఏంటి..? అని వల్లభ అడుగుతారు.
లేదంటే తినే తను.. తనే తిను అంటుంది హాసిని. అక్కడ ఉండకపోతే ఇంటికి వచ్చినట్టు వచ్చింది కూడా అంటుంది. విశాలాక్షి ఏంటి చిన్నాన్న ఏం మాట్లాడవు అని అడుగుతుంది. ఏం మాట్లాడాలి అని విక్రాంత్ అడుగుతాడు. డాక్టర్ సారిక ఎవరు అని విశాలాక్షి అడుగుతుంది. ఆమె మా ఫ్యామిలీ డాక్టర్. నయనికి ట్రీట్‌మెంట్ చేసింది తనే అని విశాల్ చెప్తాడు. దీంతో పాపం ఆమె నయని అమ్మకు వైద్యం చేసిన మరుసటి రోజే గుండె పోటు వచ్చి చనిపోయింది అని విశాలాక్షి చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. విక్రాంత్ ఆశ్చర్యపోతాడు. ఇంతలో విశాల్ డాక్టర్ చనిపోయిన విషయం మాకెందుకు చెప్పలేదని విక్రాంత్ ను అడుగుతాడు.
తను చనిపోయిందని తెలిస్తే మీరు టెన్షన్ పడతారని చెప్పలేదు అంటాడు విక్రాంత్. డాక్టర్ లేరు సరే పేషెంట్ ఉండాలి కదా…? అని వల్లభ అడగ్గానే నయని అమ్మా అక్కడ లేదు అని చెప్తున్నాను కదా.. అంటుంది విశాలాక్షి. ఈ మాటలకు విక్రాంత్ షాక్ అవుతాడు. ఈ విషయాలన్నీ విశాలాక్షికి ఎలా తెలుసు అనుకుంటాడు. ఇంతలో నేత్రి మహంకాళమ్మా నువ్వు ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది అంటుంది. ఇన్నాళ్లు నాకోసం వచ్చావు ఇప్పుడు నేను నీకోసం వచ్చాను మంచినీళ్లు తాగాలి దాహంగా ఉంది అని విశాలాక్షి అడగ్గానే అయ్యో తీసుకొస్తాను ఉండు అమ్మ అంటుంది నేత్రి నేను కూడా వస్తాను అని ఇద్దరూ వెళ్లిపోతారు.
కాసేపట్లో ఏం జరుగుతుంది అని అందరూ ఆలోచిస్తుంటారు. దేవీపురంలోనే కాదు. హాస్పిటల్ లో కూడా ఏదో జరిగింది అనిపిస్తుంది అంటాడు విశాల్. తర్వాత విక్రాంత్ ఒక్కడే విశాలాక్షి గురించి ఆలోచిస్తుంటాడు. తాను డాక్టర్ తో మాట్లాడిన విషయాలు విశాలాక్షికి ఎలా తెలిశాయని అనుకుంటాడు. ఇంతలో వెనక నుంచి సుమన వచ్చి భుజం మీద చేయి వేయగానే విక్రాంత్ భయపడతాడు. ఎందుకు భయపడుతున్నారు.. మీకెందుకు చెమటలు పడుతున్నాయి అని అడుగుతుంది. వేడిగా ఉంది కదా.. అందుకే అని విక్రాంత్ చెప్పగానే.. ఇది చలికాలం. మీకు ఇంతగా చెమటలు పడుతున్నాయంటే మీరు దేనికో భయపడుతున్నారు అంటుంది సుమన. ఆ గారడి పిల్ల మా అక్క చేత వేషాలు వేయిస్తున్నట్టు ఉంది హాల్లోకి రండి మీరు చూద్దురు అంటుంది. విక్రాంత్ రానని చెప్తాడు.
హాల్‌లో కూర్చున్న విశాలాక్షి దగ్గరకు అందరూ వస్తారు. ఏం చేస్తున్నావని అడగ్గానే అమ్మను కట్టేయడానికి తాడు రెడీ చేస్తున్నాను అంటుంది. విశాలాక్షితో మాట్లాడటం చాలా కష్టం అంటాడు విశాల్. కానీ తన మాటలంటే నాకు చాలా ఇష్టం అంటుంది హాసిని. ఇంతలో నేత్రి వచ్చి కింద కూర్చున్నావేంటమ్మా అని అడుగుతుంది. చెప్తాను కానీ ముందైతే అమ్మవారి బిల్లను నాన్న చేత నీ మెడలో కట్టించుకో అమ్మా అని విశాల్‌కు ఇస్తుంది. ఇది నీకు ఎక్కడిది అని విశాల్ అడుగుతాడు. వదిన మెడలో ఉండాలి కదా.. అంటాడు విక్రాంత్. అందుకే తీసుకొచ్చాను అని విశాలాక్షి చెప్తుంది. ఏ గుడి నుంచి తీసుకొచ్చావని హాసిని అడుగుతుంది. గుడి నుంచి కాదు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను అని విశాలాక్షి చెప్పగానే అందరూ షాక్ అవుతారు.
ముందు అయితే అమ్మవారి బిల్లను చెల్లి మెడలో కట్టు విశాల్ అంటుంది హాసిని. దీంతో సరేనని విశాల్ అంటాడు. దేవీపురం అమ్మవారి టెంపుల్‌కు వెళితే కానీ నా అనుమానాలు తీరవు అని మనసులో అనుకుంటాడు విక్రాంత్. ముందు నువ్వు కట్టు నాన్నా మూడు ముళ్లు వేయండి అని విశాలాక్షి చెప్తుంది. అందరూ అక్షింతలు తీసుకుని వేయండి అనగానే అందరూ అక్షితలు వేస్తారు. తర్వాత వల్లభ పాప నువ్విక అక్కడ నుంచి లేవవా..? అని అడుగుతాడు. మా అమ్మా వచ్చి లేపితే లేస్తాను అంటుంది. దీంతో నేత్రి వెళ్లి విశాలాక్షి చేతులు పట్టుకోగానే నేత్రి కాస్త నయనిలా మారిపోతుంది. అచ్చం నయనిలా మాట్లాడుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతటితో త్రినయని సీరియల్ నేటి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?