trinayani serial today Episode: సూట్‌కేసు నుంచి నేను లేచాక మీరు దీన్ని చూడకూడదు అంటుంది హాసిని. నయనిన నువ్వైతే లేవు అక్కా అంటుంది. సరేనని హాసిని లేస్తుంది. నయని సూట్ కేసు ఓపెన్ చేస్తుంటే..గాయత్రిని చూడగానే.. మా మీద శివంగిలా విరుచుకుపడుతుంది అని మనసులో అనుకుంటుంది తిలొత్తమ్మ. సూట్‌కేసులో గాయత్రి పాపకు బదులుగా చీరలు ఉంటాయి. దీంతో తిలొత్తమ్మ షాక్ అవుతుంది. గాయత్రి పాప ఏమైందని ఆలోచిస్తుంది. ఇంతలో పాప కిందకు వస్తుంది. పాపను చూసిన వల్లభ, తిలొత్తమ్మ షాక్ అవుతారు. ఈ సారి వైర్ తెచ్చావా..? ఫైర్ తెచ్చావా..? గాయత్రి అని హాసిని అడుగుతుంది.
అలా ఎలా బయటకు వచ్చావు అంటూ వల్లభ కన్పీజ్‌గా అడగ్గానే..అలా ఎలా అంటే ఏంటి అని విక్రాంత్ ప్రశ్నిస్తాడు. మేము వెళ్తున్నాం కదా గదిలోంచి ఎలా వచ్చిందని అడుగుతున్నావు విక్రాంత్ అని సర్ది చెప్తుంది తిలొత్తమ్మ. ఇంతలో హాసిని ఆ పిల్ల మీ ప్రాణాలు తీయడానికే ఉన్నట్టు ఉంది. అత్తయ్య అంటుంది సుమన. నా మాట విని ఎక్కడికి వెళ్లకండి ఇక్కడ ఉంటేనే.. నయని గాయత్రిని పట్టుకోగలదు అని దురందర చెప్తుంది. మీరు ఇక్కడ ఉంటేనే నయని వదిన మిమ్మల్ని సేవ్ చేస్తుంది అని చెప్పగానే.. పదరా అంటూ వల్లభ, తిలొత్తమ్మ లోపలికి వెళ్తారు.
లోపల బట్టలు సర్దుతున్న సుమన దగ్గరకు విక్రాంత్ వచ్చి ఎందుకైనా మంచిది మా అమ్మా అన్నలకు నువ్వు దూరంగా ఉండు అని చెప్తాడు. ఏమైనా ఆస్థులు రాసిస్తా అన్నారా..? అని అడుగుతాడు. అవును అత్తయ్యా చనిపోతే ఆస్థులు రాసిస్తా అన్నారు. అది కూడా చిన్నకొడుకైనా మిమ్మల్ని బాగా చూసుకుంటేనే అని చెప్తారు అంటుంది. అయితే నీకు సొంపు పూశారు వాళ్లు నిన్ను ట్రాప్‌ల వేశారు. ఇంతకుముందు బ్యాగ్‌లో గాయత్రి పాపను మాయం చేయాలని కుట్ర ఏదో చేసి ఉంటారు అని చెప్తాడు విక్రాంత్. దీంతో మరి బ్యాగ్‌లో పాప ఉండాలి కదా..? ఏమైంది. అని అడుగుతుంది. సుమన. మా పెద్దమ్మకు ఎలా తప్పించకోవాలో మా అమ్మను ఎలా తప్పించాలో తెలుసు.. నువ్వు వాళ్ల పక్కన ఉంటే బోనస్ గా నిన్ను వేస్తుంది అని విక్రాంత్ చెప్పగానే.. సుమన భయపడుతుంది. అలా జరుగుతుందంటే నేనేందుకు వాళ్ల పక్కకు వెళ్తాను అంటుంది.
దురందర ప్రగ్నెన్సీ పోవడానికి టాబ్లెట్స్ వేసుకుంటుంటే.. పావణమూర్తి భయంతో అరుస్తాడు. ఇంతలో నయని వచ్చి చేయి పట్టుకుని ఆపుతుంది. ఎందుకు ఇన్ని గోళీలు వేసుకోవాలనుకున్నావు అని రత్నాంభ అడుగుతుంది. ఇంతలో పావణమూర్తి కోపంగా దురందరను కొడతాడు. సమయానికి నయని అమ్మా వచ్చి అడ్డుకున్నందుకు సరిపోయింది లేకపోతే ఎంత ఘోరం జరిగేది అంటాడు. పిన్ని నువ్వు చేసిన పనికి ఒకటి కాదు రెండు ప్రాణాలు పోయేవి అంటూ తిడుతుంది. అసలు కారణం ఏంటి దురందర చెప్పు అంటుంది తిలొత్తమ్మ.. దీంతో దురందర ఏడుస్తూ నీ వల్లే వదిన అంటుంది. అందరూ షాక్ అవుతారు. ఏంటి మమ్మీ చేసిందంతా లోలోపల చేస్తూ ఇప్పుడేం చేయన్నట్టు నాటకం ఆడుతున్నావా..? అంటాడు వల్లభ. దీంతో తిలొత్తమ్మ వల్లభను తిడుతుంది.
నేనేం చేయలేదు అంటుంది. ఇంత కఠినమైన నిర్ణయం పిన్ని తీసుకుంది అంటే దీని వెనక ఏదో జరిగే ఉంటుంది అని హాసిని ప్రశ్నిస్తుంది. నాలుగు రోజుల్లో పోయేదానివి ఇలా ఎందుకు చేశాము మమ్మీ అంటూ వల్లభ నిలదీయగానే తిలొత్తమ్మ వల్లభను చెంప పగుల గొడుతుంది. ఎవరికి వారు ఏవేవో ఊహించుకుంటున్నారు కానీ పిన్ని అసలు కారణం ఏంటో చెప్పు అని నయని అడుగుతుంది. పోయి పోయి అలాంటి దాన్నా.. నేను కనబోయేది అని బాధేసింది అంటుంది దురందర. దీంతో అందరూ షాక్ అవుతారు. పిన్ని నువ్వు ఇలా అంటే అత్తయ్య బాధపడతారు కదా అంటుంది సుమన. మీరు ఏమైనా అనుకోండి.. వదిన మాత్రం నా కడుపున పుట్టకూడదు అంటుంది దురందర.
తర్వాత దురందర ఒక్కతే కూర్చుని ఆలోచిస్తుంటే.. వల్లభ వచ్చి మమ్మీ నువ్వు సైలెంట్‌గా ఉంటే నేను చూడలేను అంటాడు. ఇంతలో సుమన వచ్చి ఎవరు అయోమయంగా ఉంటే మాఅక్క మాత్రం చాలా క్లారిటీగా ఉంది అత్తయ్యా అని చెప్తుంది. దేని గురించి చిన మరదలా..? అని వల్లభ అడగ్గానే.. చంటి పిల్లలు తెలిసో తెలియకో.. దారుణానికి పాల్పడితే అది నేరంగా చూస్తారా..? శిక్ష వేస్తారా.. అని సీనియర్ లాయర్లతో మాట్లాడుతుంది అని చెప్పగానే..తిలొత్తమ్మ, వల్లభ షాక్ అవుతారు. గాయత్రి వల్ల నాకు చావు వస్తుందో లేదో కానీ నావల్ల మీ అక్క సంగతి చూస్తా.. అంటుంది తిలొత్తమ్మ. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?