BigTV English

PM Modi Awards: ప్రధాని మోడీకి విదేశాల్లో ఘనసన్మానం.. డామినికా, గయానా దేశాల్లో అత్యున్నత పురస్కారాలు..

PM Modi Awards: ప్రధాని మోడీకి విదేశాల్లో ఘనసన్మానం.. డామినికా, గయానా దేశాల్లో అత్యున్నత పురస్కారాలు..

PM Modi Awards| విదేశీ పర్యటనలో ఉన్న భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఘనసన్మానం లభించింది. బ్రెజిల్, గయానా, డామినికా, నైజీరియా దేశాలకు అయిదు రోజుల పర్యటన మీద వెళ్లిన ప్రధాని మోడీకి డామినికా అధ్యక్షుడు సిల్వేనీ బుర్టన్ బుధవారం దేశ అత్యున్నత పురస్కారం ‘డామినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’ అందించారు. డామినికా, భారత్ మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరిచేందుకు, కరోనా మహమ్మారి సమయంలో కెరిబ్బియన్ దేశాలకు భారత దేశం అందించిన సేవలకు గుర్తింపుగా ప్రధాని మోదీకి ఈ సన్మానం చేశారు.


ఆ తరువాత గురువారం గయానా(Guyana) దేశ అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ కూడా ప్రధాని మోడీకి గయానా దేశ అత్యున్నత పౌర పురస్కారం (ది గ్రేట్ ఆనర్ ఆఫ్ ఎక్సెలెన్స్ గయానా) ప్రదానం చేశారు. అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ సౌత్ దేశాల ప్రతినిధిగా ప్రధాని మోడీ సమర్థవంతంగా కృషి చేస్తున్నారని.. ఆయన విజనరీ లీడర్‌షిప్ తాము చేస్తున్న సన్మానం అని ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ కొనియాడారు. గయానాలోని జార్జిటౌన్ లో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది.

Also Read: అంతరిక్షంలో క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం.. ఆహారం కొరతతో బలహీనపడి..


ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ట్విట్టర్ ఎక్స్ లో ట్విట్ చేసి తెలిపారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గయానాలోని జార్జిటౌన్ లో జరుగుతున్న ఇండియా-కారికామ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఇప్పటివరకు నైజీరియా, డామినికా, గయానా దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్న ప్రధాని మోడీకి బార్బడాస్ దేశం కూడా పురస్కారంతో సన్మానం చేయనుంది దీంతో ప్రధాని మోడీ ఇప్పటివరకు మొత్తం 19 అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.

డామినికా పురస్కారం అందిన తరువాత ప్రధాని మోదీ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “నాకు లభించిన పురస్కారాలు.. భారతదేశంలో నివసించే 140 కోట్ల మంది నా సోదర, సోదరిమణులకు అంకితం చేస్తున్నాను. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న విడదీయరాని బంధాలకు ప్రతీక.” అని ట్వీట్ లో రాశారు.

డామినికా (dominica) ప్రధాన మంత్రి రూజ్‌వెల్ట్ స్కెర్రిట్ కూడా కరోనా సమయంలో తమ దేశానికి చేసిన సాయానికి, ఆయనలో నాయకుడిని ధన్యవాదాలు తెలుపుతూ డామినికా, భారత్ మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి ప్రధాన మంత్రి మోడీకి ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. 2021 కరోనా కష్టకాలంలో తమ దేశం వైద్య సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో భారత ప్రభుత్వం డామినికా దేశానికి 70,000 ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ఉచితంగా పంపిణీ చేసిందని.. ఈ వ్యాక్సిన్లు డామినికా దేశ ప్రజలకు మళ్లీ ఊపిరి పోశాయని డామినికా ప్రధాని గుర్తు చేశారు.

డామినికా ప్రధాని ట్విట్ పై భారత ప్రధాని మోడీ స్పందించారు. “మీ చేసిన వ్యాఖ్యలు నా హృదయాన్ని కదిలించాయి. నేను డామినికా అవార్డుని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. కోవిడ్ -19 సంక్షోభ సమయంలో మీకు లభించిన మద్దతు గురించి మీరు చెప్పారు. కోవిడ్ లాంటి కష్టసమయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయి. భవిష్యత్తులో కూడా డామినికాలో కలిసి పనిచేస్తూ ఉంటాం” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×