E-Paper
Advertisement

Trinayani Serial Today October 16th: ‘త్రినయని’ సీరియల్‌: నయని కోసం వచ్చిన యమపాశం – నిజం తెలుసుకుని షాకైన విశాల్ 

Trinayani Serial Today October 16th: ‘త్రినయని’ సీరియల్‌: నయని కోసం వచ్చిన యమపాశం – నిజం తెలుసుకుని షాకైన విశాల్ 
Advertisement

trinayani serial today Episode:  నయని జాతకం పేపరు అనుకుని సుమన జాతకం పేపరు తీసకొచ్చి చూస్తుంది తిలొత్తమ్మ.  ఇంతలో అక్కడకు వచ్చిన హాసిని ఏంటది అని అడుగుతుంది. నీకెందుకు చెప్పాలి అంటాడు వల్లభ. నాకు చెప్పకపోయనా తెలుస్తుంది. అది నయని జాతకం పేపరు అనుకుంటున్నారు కానీ అది నయనిది కాదు అని చెప్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన నయని ఏంటక్కా నా జాతకం పేపరు తీసుకుని రమ్మన్నావు అని అడుగుతుంది. తిలొత్తమ్మ చేతిలో పేపరు తీసి నయనికి ఇచ్చి..  ఇది ఎవరిది అని అడుగుతుంది హాసిని.

ఇది సుమనది అని నయని చెప్పగానే వల్లభ, తిలొత్తమ్మ షాక్‌ అవుతారు. నువ్వు పేపరు అటూ ఇటూ తిప్పుతుంటేనే నాకు తేడా కొట్టింది మమ్మీ అంటాడు వల్లభ. అయినా మా జాతకాలతో పని ఏంటి అత్తయ్యా అని నయని అడుగుతుంది. సరేలే కానీ ఒకసారి నీ జాతకం పేపరు ఇలా ఇవ్వు నయని అని అడిగి తీసుకుని చూస్తుంది తిలొత్తమ్మ. ఇంతలో వల్లభ మమ్మీ గుడ్డి ఎద్దులా నువ్వు అలా చూడకు అంటాడు వల్లభ. దీంతో లేదురా..? అంటుంది తిలొత్తమ్మ. ఏంటి నీకు చూడటం రాదా అంటాడు. కాదురా నయని జాతకంలో గండం ఏమీ లేదు అంటుంది.  నేను ఊహించని ప్రమాదం ఏదో జరుగుతుందని చెప్పినా మీరు ఇలా జాతకాలు చూడటం మంచిది కాదు అంటుంది నయని. చూడటం మంచిదే కదా అంటుంది తిలొత్తమ్మ.

Advertisement

నయని హాల్లో పని చేసుకుంటుంటే గాయత్రి పాప ఆడుకుంటుంది. ఇంతలో సుమన వస్తుంది. నయని వైపు యమపాశం వస్తుండటాన్ని సుమన భయపడుతుంది. గట్టిగా పాము అని అరుస్తుంది. అందరూ  వస్తారు. ఏమైందని అడుగుతారు. అక్కడ పాము ఉంది చెప్తుంది. అందరూ చూడగానే అక్కడ తాడు ఉంటుంది. నయని ఆ తాడును చూసి ఇల్లంతా శుభ్రం చేస్తుంటే ఈ  తాడు ఎవరి ఇక్కడ పడేశారు అని స్టోర్‌ రూంలో వేసేందుకు తీసుకుని వెళ్తుంటే విశాలాక్షి వస్తుంది.

అది నువ్వు ఎక్కడ వేసినా నీ వెనకే వస్తుందని చెప్తుంది. ఎందుకు? అని విశాల్‌ అడిగితే అది విధి. కొన్ని సార్లు పరుగెత్తుకు వస్తుంది. కొన్ని సార్లు శిక్షిస్తుంది అని చెప్తుంది విశాలాక్షి. నేను పాము అని చెప్తే ఎవ్వరూ నమ్మరేంటి అని సుమన అరుస్తుంది. ఇంతలో నయని నువ్వేం అంటున్నావో అర్థం కావడం అమ్మా అని అడుగుతుంది. మాటలతో స్పష్టం గా చెప్తే పెద్దమరదలుకు అర్థం అవుతుంది పాప అంటాడు వల్లభ. దీంత నువ్వు చేతిలోకి తీసుకున్నది తాడు కాదమ్మా.. యమపాశం అని చెప్తుంది.

Advertisement

అందరూ షాక్‌ అవుతారు. వెంటనే విశాల్‌ దాన్ని పడేయ్‌ నయని అని చెప్తాడు. నయని కింద పడేస్తుంది. దూరంగా విసిరిన, అగ్నిలో కాల్చిన అది పాడవదు నాన్నా.. ఎందుకంటే అది ఎన్నో ఆత్మలను తీసుకెళ్లే పాశం అని చెప్తుంది. అమ్మను పట్టుకోవాలని వచ్చిన పాశాన్నే  అమ్మే దాన్ని పట్టుకుంది అంటుంది. అంటే చేజేతులా మా అక్కే ప్రాణాల మీదకు తెచ్చుకుంది అంటున్నావా? అని సుమన అడుగుతుంది. దీంతో విశాల్‌ కోపంగా సుమనకు వార్నింగ్‌ ఇస్తాడు. విశాలాక్షి అన్న మాటనే నేను వివరంగా చెప్పాను కదా బావగారు అంటుంది సుమన. అయితే నిన్న పెద్దమరదలుకు పడ్డ కల నిజం కావొచ్చోమో తమ్మి అంటాడు వల్లభ.

ఏం కల వచ్చిందమ్మా అని విశాలాక్షి అడుగుతుంది. విశాల్‌ మాత్రం నయని వదిలేయ్‌ అంటాడు. ఇంతలో సుమన నన్ను తిట్టినా కొట్టినా నిజం చెప్పేస్తున్నానని నయని చనిపోయినట్టు కల వచ్చిందని సుమన చెప్తుంది. అయితే సరే నయనిని కొంచెం వెనక్కి వెళ్లమనదాం గారడి పాప అన్నట్టు ఆ తాడు నయని వైపు వెళ్తుందా? చూద్దాం అంటాడు వల్లభ. అందరూ నయనిని పది అడుగులు దూరం వెళ్లమని చెప్తారు. నయని వెనక్కి వెళ్తుంది. ఇంతలో తాడు పాశంలా మారి గాయత్రి పాప దగ్గరకు వెళ్లి ఆగిపోతుంది. అందరూ షాక్‌ అవుతారు.

కొంప దీసి ఈ పిల్ల పుటుక్కు మంటుందా? ఏంటి అంటుంది సుమన. దీంతో నయని కోపంగా చెల్లి ఏంటా ఆ మాటలు అంటూ ఏంటో అంతా అయోమయంగా ఉంది అంటుంది. దీంతో విశాల్‌ నాకు అర్థం అయింది. ఇదంతా విశాలాక్షి చేస్తున్న మ్యాజిక్‌ అనగానే మరి మీ ఆవిడకు వచ్చిన కల ఏంటని వల్లభ అడుగుతాడు. అయితే నా మాట తప్పు అని అంటారా? అని ప్రశ్నిస్తుంది విశాలాక్షి. నిజం నిరూపించకపోతే తప్పు అనకపోతే ఇంకేం అంటారు పాప అంటుంది తిలొత్తమ్మ. అయితే గాయత్రి వైపు పాశం ఎందుకు వచ్చిందో ఆలోచించండి అని చెప్పి వెళ్లిపోతుంది విశాలాక్షి.

తర్వాత విశాల్‌ బయట గాయత్రి పాపతో మాట్లాడుతుంటాడు. నయని వెనకాల వెళ్లిన తాడు తర్వాత నీ వెనకాల రావడం ఏంటని అడుగుతాడు. ఇంతలో ఆ తాడు తీసుకుని వల్లభ, తిలొత్తమ్మ వస్తారు. తమ్మి చూశావా? ఈ తాడును ఒకప్పుడు పక్కకు కూడా జరపలేకపోయాం. ఇప్పుడు ఎలా మోసుకొచ్చాను అంటాడు. దాన్నెందుకు తీసుకొచ్చామని అడగవేంటి విశాల్‌ అంటుంది తిలొత్తమ్మ.

ఇక చెప్పకండి అమ్మా అంటాడు విశాల్‌. దీంతో నేను నయని గురించి మాట్లాడటానికి రాలేదు అంటుంది తిలొత్తమ్మ అనగానే అయితే నేను రావొచ్చన్నమాట అంటూ అక్కడికి వస్తుంది నయని. ఇంతకీ మేము చెప్పేది ఏంటంటే మీ ఆవిడకు గండం ఉందని తనే చెప్పింది కదా తమ్మి.. ఈ తాడు నీ వెంట వచ్చి నీకు గండం అని చూపించింది కదా? పెద్దమరదలా.. కానీ మళ్లీ ఇదే తాడు గాయత్రి పాప దగ్గరకు వెళ్లిందంటే ఏంటి అర్థం అని వల్లభ అంటాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×