BigTV English

Brahmaji : బండ బూతులు తిట్టిన నెటిజన్… మధ్యలోకి ప్రభాస్ ను లాగుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బ్రహ్మాజీ

Brahmaji : బండ బూతులు తిట్టిన నెటిజన్… మధ్యలోకి ప్రభాస్ ను లాగుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బ్రహ్మాజీ

Brahmaji : గత రెండు రోజుల నుంచి హీరో నాగార్జున ఫ్యామిలీ పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై సినీ పరిశ్రమ అంతా స్పందిస్తూ ముక్తకంఠంతో ఖండిస్తుండగా, నాగార్జున మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టు మెట్లు ఎక్కిన విషయం కూడా విదితమే. ఇక ఊహించని ఈ పరిణామానికి మంత్రి కొండా సురేఖ దిగివచ్చి క్షమాపణలు చెప్పినప్పటికీ అక్కినేని అభిమానుల కోపం చల్లారట్లేదు. ఈ వివాదంపై రోజుకో సినీ సెలబ్రిటీ స్పందిస్తూ ఉండడంతో ఇంకా కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ కామెంట్స్ పై టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ వ్యంగ్యంగా స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. దానిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుండగా, ఓ వ్యక్తి ఏకంగా హద్దులు దాటి బ్రహ్మాజీని బండ బూతులు తిట్టాడు. దానికి బ్రహ్మాజీ ఇచ్చిన కౌంటర్ ఏంటో చూసేద్దాం పదండి.


కొండా సురేఖ వ్యాఖ్యలపై బ్రహ్మాజీ కౌంటర్

మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మరో వీడియో ఇప్పుడు నెట్టింట్లో  హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో హీరోయిన్ సమంత విషయంలో తను చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకున్న మంత్రి కొండా సురేఖ తనకు కోపం వచ్చినందుకే ఇలాంటి వాస్తవాలను బయట పెట్టాల్సి వచ్చిందని తన కామెంట్స్ ను సమర్థించుకున్నారు. కానీ ఇప్పటి వరకు నాగ చైతన్య, సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయంలో అసలు నిజాలు ఏంటో బయట ప్రపంచానికి తెలియదని, టాలీవుడ్ నుంచి తనకు అందిన అంతర్గత సమాచారాన్ని నేను బయటకు చెప్పానని వివాదాన్ని మరింత పెద్దది చేసే విధంగా కామెంట్స్ చేసింది కొండా సురేఖ. అంతేకాకుండా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో తాను తగ్గబోయేది లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై మరింత మండిపడుతున్నారు మూవీ లవర్స్. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన బ్రహ్మాజీ ఈ లేటెస్ట్ వీడియో పై తనదైన స్టైల్ లో స్పందించారు. ‘ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా మంత్రి గారు..’ అంటూ వ్యంగ్యంగా ఓ పోస్ట్ పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.


బ్రహ్మాజీ పై బండ బూతులు

ఇక బ్రహ్మాజీ పెట్టిన పోస్ట్ పై నెటిజెన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తుంటే, మరి కొంత మంది బండబూతులతో విరుచుకుపడుతున్నారు. ఓ నెటిజన్ అయితే ఏకంగా బీప్ పదాలు వాడి బ్రహ్మాజీని తిట్టాడు. అయితే బ్రహ్మాజీ అతను చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ ‘నన్ను తిట్టాలంటే ఓన్ అకౌంట్ తో, డిపి పెట్టుకొని తిట్టండి. దేవుడు లాంటి నా ప్రభాస్ ఫోటో పెట్టుకుని తిడితే అతని ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. సరే మీ అమ్మగారిని అడిగినట్టు చెప్పండి’ అంటూ తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు’ బ్రహ్మాజీ. దీంతో తెలివిగా బ్రహ్మాజీ తనపై అసభ్య పదజాలంతో కామెంట్స్ చేసిన వ్యక్తికి గుణపాఠం చెప్పిన విధానంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్లు.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×