BigTV English

Trinayani Serial Today September 24th: ‘త్రినయని’ సీరియల్‌: అడవిలో స్పృహ కోల్పోయిన విశాల్‌ – నయనికి దారి చూపించిన కావులమ్మ

Trinayani Serial Today September 24th: ‘త్రినయని’ సీరియల్‌: అడవిలో స్పృహ కోల్పోయిన విశాల్‌ – నయనికి దారి చూపించిన కావులమ్మ

trinayani serial today Episode:  భుజంగమణి కోసం వెళ్తున్న నయని, విశాల్‌ ను చూసి ఏది ఏమైనా నయని తిరిగి వస్తుంది. అని విశాల్‌ రాడు అని ఇన్‌డైరెక్టుగా అంటుంది తిలొత్తమ్మ. దీంతో తన మీద నమ్మకం ఉన్నందుకు కృతజ్ఞతలు అత్తయ్యా కానీ నేను తిరిగి వచ్చానంటే నా పక్కన కచ్చితంగా విశాల్‌ బాబుగారు ఉంటారు అంటుంది. దీంతో హాసిని మీరిద్దరూ వచ్చారంటే గాయత్రి అత్తయ్య కూడా వస్తుంది అంటుంది.


దీంతో విశాల్‌, తిలొత్తమ్మ, సుమన, వల్లభ షాక్‌ అవుతారు. వీళల్తో పాటు వెళ్లేది గాయత్రి పాప కదా? గాయత్రి అత్తయ్య అంటావేంటి అని సుమన అడుగుతుంది. విశాల్‌ కూడా వదిన నువ్వు ఏమంటున్నావో అర్థమౌతుందా? అని అడుగుతాడు. దీంతో అవును అర్థం అయింది. మీరిద్దరూ క్షేమంగా వస్తే మిమ్మల్ని చూడటానికి గాయత్రి అత్తయ్య వస్తారు కదా అంటుంది హాసిని.  వీళ్లు తిరిగొచ్చాక ఇక్కడ బలి ఉంటుంది. గాయత్రి అత్తయ్య చావుకు కారణం అయిన వాళ్లను బలి తీసుకోవాలి కదా అంటుంది. దీంతో వల్లభ భయంగా నువ్వు అలా మాట్లాడొద్దని నయని ఇక మీరు వెళ్లండి అని చెప్తాడు.

అలా చెప్తే ఏం బాగుంటుందిరా.. భర్త కోసం అన్ని రకాలుగా సిద్దపడి వెళ్తున్న నయనికి, భార్యకు తోడు నీడగా వెన్నంటే ఉంటున్న భర్తకి, దత్తత తీసుకున్నందుకు ఈ జన్మంతా మీ వెంటే అని వెళ్తున్న గాయత్రి పాపకు ముగ్గురికి చేతిలో చేయి కలిపి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాలి అని తిలొత్తమ్మ గాయత్రి పాప దగ్గరకు వెళ్లి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోతుంది. ఇందాక కర్పూరం కాలినట్టు ఇప్పుడు మీ అమ్మే కాలిపోయేలా ఉంది అంటుంది హాసిని. చేయి చాచాను చేయి కలపండి నయని అని అడుగుతుంది తిలొత్తమ్మ.


దీంతో ఏమీ అనుకోకండి అత్తయ్యా బాబు గారు చేయి కదపలేనప్పుడు నేను చేయి ఇవ్వను అత్తయ్యా అంటుంది నయని. దీంతో కనీసం గాయత్రి పాపైనా చేయి కలుపుతుంది అంటారు. గాయత్రి పాప మాత్రం చేయి కలపదు. దీంతో ఎందుకు చేయి కలపడం లేదు అని తిలొత్తమ్మ అడుగుతుంది. మంటొస్తుదని కలపడం లేదని హాసిని అంటుంది. అయితే ఈ పిల్లనే గాయత్రి అక్కయే అయితే కచ్చితంగా నా చెయ్యి కాలిపోతుంది హాసిని అంటుంది తిలొత్తమ్మ. నయని కూడా గాయత్రి పాపకు చేయి కలపమని చెప్తుంది. దీంతో గాయత్రి పాప నయని, విశాల్‌ ల చేయి తీసి తిలొత్తమ్మ చేతిలో పెడుతుంది. తర్వాత ముగ్గురు కలసి బయలుదేరుతారు.

విశాల్‌, నయని, గాయత్రి పాప వెళ్తుంటారు. మరోవైపు గజగండ కూడా అడవిలో నడుస్తూ గాయత్రిదేవి చెప్పినట్టు చాలా దూరం వచ్చాను ఇంకా గుడి కనిపంచడం లేదని అనుకుంటాడు. మరోవైపు విశాల్‌ ఎంత నడిచినా మనం గుడికి దగ్గరకు వచ్చినట్టు కనిపించడం లేదు. అమ్మ చెప్పిన దారిలో వెళ్లడం లేదా? అని అడుగుతాడు. లేదని ఆరోజు గజగండ మనల్ని ఫాలో అవ్వకుండా అమ్మగారు అలా చెప్పారు. అని నడక సాగిస్తారు. మరోవైపు గజగండ ఇక నేను దారి తప్పాను ఎటు వెళ్లినా ఒకే దగ్గరకు వస్తున్నాను. నన్ను మోసం చేశావు గాయత్రిదేవి అంటూ అరుస్తుంటాడు. మరోవైపు విశాల్‌ నడవలేక కళ్లు తిరిగి కింద పడిపోతాడు. ఇక నేను రాలేనని తెలియని దారిలో ఎలా వెళ్లాలి అని అడుగుతాడు. మా అమ్మకే దారి తెలియనప్పడు మనం ఎలా వెళ్లాలి చెప్పు అంటాడు.

ఇంతలో ఒక ముసలావిడ వస్తుంది. ఆమెను చూసిన నయని ఇలాంటి కారడవిలో ఈ అవ్వ ఎందుకొచ్చింది బాబుగారు అని అడుగుతుంది. అవ్వనా..? అక్కడ ఎవ్వరూ లేరు నయని ఎవరికి చెప్తుంది. అని అనుకుంటాడు. నయని ఏమైది నీకు అని అడుగుతాడు. నయని మాత్రం అవ్వ ఆలయానిక దారి చెప్పు అని అడుగుతుంది. విశాల్‌ మాత్రం నయని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అదైనా చెప్పు అని అడుగుతాడు. దీంతో అవ్వా నువ్వు ఎవరో ఏంటో చెప్పమని అడుగుతున్నారు బాబుగారు అంటుంది నయని.

తన పేరు కామసాని అని మా బంధువులందరూ కావులమ్మా అని పిలిచేవారు అని ఆ అవ్వ చెప్తుంటే.. విశాల్‌ ఎవరు లేరు కదా? అని అడుగుతాడు. కావులమ్మా నయనికి దారి చెప్పి వెళ్లిపోతుంది. దీంతో విశాల్‌ నాకు ఎవ్వరూ కనిపించలేదని చెప్తాడు. దీంతో నయని షాక్‌ అవుతుంది. పట్టుచీర కట్టుకుని విబూది పెట్టుకుని ఇప్పటిదాకా నా ముందే ఉంది కదా? అని చెప్తుంది నయని.  కామసాని గురించి తాళపత్రాలలో ఉన్న విషయం గుర్తు చేసుకుంటుంది నయని. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big Stories

×