Tv Actor Prabhakar: తెలుగు బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాలుగా నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు ప్రభాకర్(Prabhakar) ఒకరు. తెలుగు బుల్లితెరపై ఎన్నో అద్భుతమైన సీరియల్లో నటించిన ఈయన ప్రస్తుతం స్టార్ మా లో ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ లో నటిస్తున్నారు. కెరియర్ పరంగా ప్రభాకర్ ఎంతో బిజీగా ఉన్నారని చెప్పాలి. అయితే తాజాగా ఈయన తన ఇన్స్టాగ్రామ్ వేదికగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10(Bigg Boss 10) కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ గత రాత్రి బిగ్ బాస్ 10 కి సంబంధించిన నామినేషన్ ఎపిసోడ్ చూసానని తెలిపారు. అయితే ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుండా తాను ఉండలేకపోతున్నానని ప్రభాకర్ తెలిపారు. ఈ ఎపిసోడ్ లో భాగంగా కంటెస్టెంట్ సుధీర్ రెడ్డి (Sudheer Reddy) ఘోరంగా బలి అయ్యాడని ప్రభాకర్ తెలిపారు. జనాలు వారిని వారు చూపించుకోవడం కోసం, అటెన్షన్ కోసం గొడవలు చేయాలి అనుకొని గొడవ చేశారనిపించిందని ప్రభాకర్ తెలిపారు. రాత్రి ఎపిసోడ్ లో సుధీర్ నాకు ఫ్రీడమ్ వచ్చిందని మాత్రమే చెప్పారు కానీ దానిని ఎవరికి తోచినట్టు వారు ఊహించుకోవడం అలాగే సృష్టికి కొంత మంది లేనిపోని మాటలు చెప్పి సుధీర్ ను బ్లేమ్ చేశారని ప్రభాకర్ తెలిపారు.
గత వారంలో సృష్టి పెద్దగా ఆటతీరు కనబరచలేదని తాను అటెన్షన్ కోసం ఒకవేళ ఆ మాటలు మాట్లాడి ఉన్నప్పటికీ శాలిని, త్రిగుణ్, రోహిత్ అది నిజం అనుకొని ఆ అమ్మాయికి ఆజ్యం పోస్తున్నారని ప్రభాకర్ మండిపడ్డారు. ప్రస్తుతం సమాజంలో పరిస్థితి కూడా ఇలాగే ఉందని నిజాయితీగా ఉండే వారిని ఎవరు నమ్మరు ఫేక్ అనే ముసుగు వేసుకున్న వారిని నమ్ముతున్నారు. ఇలాంటి వాళ్లు ఉన్నప్పుడు మనం భయపడి వెనకడుగు వేయకూడదు.సుధీర్ కూడా వెనకడుగు వేయకూడదని తెలిపారు. ఇక తను అన్న మాటకు వేరే వేరే అర్థాలతో ప్రతి ఒక్కరూ సుధీర్ ని అటాక్ చేశారు త్రిగుణ్ అయితే ఏకంగా క్యారెక్టర్ అంటూ కూడా మాట్లాడారని ప్రభాకర్ ఫైర్ అయ్యారు.
?stkn=bXlreTU2N210ZnR5
ఇలా నామినేషన్ లో భాగంగా సుధీర్ గురించి సృష్టి చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే సుధీర్ కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఇక తాజాగా ప్రభాకర్ నుంచి కూడా మద్దతు లభించడం విశేషం. మరి సృష్టి చేసిన ఈ వ్యాఖ్యలు కారణంగా ఈవారం ఓటింగ్ విషయంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనేది తెలియాల్సి ఉంది. మూడవ వారంలో భాగంగా సృష్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుంది అంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి. మరి నిజంగానే సృష్టి మూడవ వారం ఎలిమినేట్ కానున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: బాలయ్య వాయిస్ తో ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ట్రైలర్ రిలీజ్!