KTR: స్వేచ్చ బ్యూరో: నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై మాజీ మంత్రి హరీష్‌రావుతో కలిసి పార్టీ నేతలతో భేటీఅయ్యారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలతో చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు జరగనున్న ఉమ్మడి జిల్లాల మాజీ మంతులు, ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ నేతలకు పార్టీ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. విజయం కోసం ఇప్పటి నుంచే పకడ్బందీగా పనిచేయాలనిసూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఉమ్మడి జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
అదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఇంకా 23 మంది పసిపిల్లలు గాయపడిన నేపథ్యంలో వెంటనే మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడాలని కోరారు. ఎక్స్ వేదికగా మంగళవారం పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు ఘోర వైఫల్యం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగి, అభంశుభం తెలియని పిల్లలు అన్యాయంగా బలైపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ వైద్యరంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, ఈ ఘటనకు సీఎం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Also read: ఆత్మవిశ్వాసం, ఉత్సాహంగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎక్కడికి వెళ్లినా సందడి చేస్తారు
రిమ్స్ ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితులపై అనేకసార్లు బీఆర్ఎస్ జిల్లా నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించినా మొద్దునిద్ర పోయిన కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం కనిపించలేదన్నారు. అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన పిల్లల వార్డులో ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా లోపించడం, కనీస నిర్వహణ లేకపోవడం వల్లే ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుందన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పిల్లల వార్డులు, ఐసీయూలను నిపుణులతో తనిఖీ చేయించి ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ సర్కారు చేతకానితనం వల్ల తమ పసిపిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలనిడిమాండ్ చేశారు.
ఎంజీఎం ఆసుపత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి దారుణంఅని కేటీఆర్ మండిపడ్డారు. ఆసుపత్రిలో పెచ్చులు ఊడి గాయపడిన రోగులను పరామర్శించేందుకు వెళ్లిన వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.రోగుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లిన ప్రజాప్రతినిధిపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం ఏమిటి? అని నిలదీశారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన నాయకుడిని అడ్డుకోవడమే కాకుండా కడుపులో తన్నడం, చేయి విరిగేలా దాడి చేయడం అత్యంత గర్హనీయం అన్నారు. వినయ్ భాస్కర్‌పై జరిగిన దాడికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Also read: ఏసీబీకి చిక్కిన మంచిర్యాల గ్రామ పరిపాలనా అధికారి!