E-Paper
Advertisement

బాలయ్య వాయిస్ తో ‘డోంట్  ట్రబుల్  ద ట్రబుల్’ ట్రైలర్ రిలీజ్!

బాలయ్య వాయిస్ తో ‘డోంట్  ట్రబుల్  ద ట్రబుల్’ ట్రైలర్ రిలీజ్!
Advertisement

Dont Trouble The Trouble Trailer:  మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఫహద్ ఫాజిల్ (Fahad Fassil) పుష్ప సినిమా ద్వారా తెలుగులో కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో భన్వర్ సింగ్ శకావత్ అనే పాత్ర ద్వారా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం ఒక తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. “డోంట్ ట్రబుల్ ద ట్రబుల్”(Dont Trouble The Trouble)అంటూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు.

ఆసక్తికరంగా DTTT ట్రైలర్…

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు బాలకృష్ణ(Balakrishna) వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. అనగనగా ఒక ఊర్లో ఒక నక్క ఉండేది దానికి రెండు విషయాలు మాత్రం బాగా తెలుసు అంటూ ఫహద్ ఫాజిల్ ను పరిచయం చేశారు. ఆ గుంట నక్కకు రెండు విషయాలు మాత్రమే తెలుసు ఒకటి డబ్బు.. రెండు ట్రబుల్ .. ఎక్కడ డబ్బులు ఉన్నా వాసనతో పసిగట్టేది.. ఎక్కడ ట్రబుల్ ఉన్న పారిపోయేది అంటూ బాలయ్య ఈ ట్రైలర్లో డైలాగులు చెప్పడం చివరికి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అంటూ బాలయ్య వాయిస్ ఓవర్ తో ట్రైలర్ అదిరిపోయిందని చెప్పాలి.

మాయలు, మంత్రాలుగా ట్రైలర్…

Advertisement

ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం అల్లావుద్దీన్ స్టైల్లో మాయలు మంత్రాలు తెలిసిన ఓ చిన్నారి హీరో జీవితంలోకి ఎలా వచ్చింది? ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనే విషయాలతో ట్రైలర్ చాలా ఆసక్తికరంగా మార్చేశారు. ఇలా ట్విస్టులతో పాటు కామెడీ కూడా ట్రైలర్ లో బాగా చూపించారు. ఈ ట్రైలర్ వీడియోలో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. మరి మలయాళంలో ఇప్పటికే హిట్స్ అందుకున్న ఫహద్ తెలుగు సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ప్రముఖ టాలీవుడ్ దర్శక వీరుడు ఎస్ఎస్ రాజమౌళి (S.S.Rajamouli)సమర్పణలో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రాజమౌళి కొడుకు ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు. ఇదివరకే ఈ సినిమా నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్ వీడియో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ట్రైలర్ కూడా సినిమా పట్ల మరిన్ని అంచనాలను పెంచేసింది.ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్, సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవా వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మరి అక్టోబర్ రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. రాజమౌళి సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.

Also Read: ఆ సీరియల్ సెకండ్ లైఫ్ ఇచ్చింది..గుండె నిండా గుడి గంటలు రోహిణి !

Related News

తెల్ల కాగితం’ ట్రైలర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ఎమోషనల్ లవ్ డ్రామా!

వాయిదా పడ్డ ‘ఆదర్శ కుటుంబం-AK47’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ఇంటిమేట్ సీన్స్‌లో అసలు మ్యాటర్ ఇదే.. విషయం చెప్పిన క్రేజీ డైరెక్టర్ !

‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ వచ్చేస్తోంది.. శర్వా ఫ్యాన్స్‌కు పండగే!

‘ది ప్యారడైజ్’ లో మోహన్ బాబు పాత్ర అంత భయంకరంగా ఉంటుందా?

రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఏకంగా రూ.350 కోట్ల వసూళ్లు!

డ్యాన్స్ ఫ్లోర్ నుంచి విలన్ రోల్ వరకు.. రాఘవ్ జుయాల్ జర్నీ ఇదే!

Big Stories

Advertisement
×