E-Paper
Advertisement

ఇక స్మార్ట్ సిటీగా నల్గోండ జిల్లా.. మంత్రి వెంకట్ రెడ్డి కీలక నిర్ణయం!

ఇక స్మార్ట్ సిటీగా నల్గోండ జిల్లా.. మంత్రి వెంకట్ రెడ్డి కీలక నిర్ణయం!
Advertisement

Nalgonda: స్వేచ్ఛ బ్యూరో: నల్లగొండ నగర రూపురేఖలు మార్చేలా ప్రభుత్వం అభివృద్ధి, నిర్మాణ పనులను వేగవంతం చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్ది, రాష్ట్రంలోనే ఉత్తమ కార్పొరేషన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మంగళవారం ఇందిరాభవన్‌ వద్ద కార్పొరేషన్‌ పరిధిలో పరిశుభ్రత కోసం రూ.1.01 కోట్లతో ఏర్పాటు చేసిన రెండు వెట్టింగ్‌ మెషిన్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నల్గొండ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పౌర సేవలు అందించడమే లక్ష్యమన్నారు.

24 గంటల తాగునీటికి రూ.83 కోట్లు..

నల్లగొండ నగరానికి 24 గంటల తాగునీటి సరఫరా కల్పించేందుకు రూ.83 కోట్లతో టెండర్లు పిలిచినట్లు మంత్రి వెల్లడించారు. ఎస్డీఎఫ్‌ నిధులతో ఇప్పటికే 63 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించామని, మిగిలిన డివిజన్లలోనూ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఆరు నెలల్లో ఎస్టీపీ..

Advertisement

నగరంలో మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు చేపట్టిన ఎస్టీపీ పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు నగర పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. రూ.900 కోట్లతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నల్లగొండ కార్పొరేషన్‌ పరిధిలో రూ.900 కోట్లతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, ఎస్టీపీ, తాగునీరు వంటి మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేసి నగరాన్ని ఆధునిక సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇటీవల నల్లగొండ కార్పొరేషన్‌కు స్వచ్ఛ అవార్డు లభించిందని గుర్తుచేసిన మంత్రి.. ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి చేసి ఉత్తమ కార్పొరేషన్‌ అవార్డు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విద్యకు పెద్దపీఠ

విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని.. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి అవార్డులను ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పాఠ్యాంశాలు బోధించడంతో ఉపాధ్యాయుల బాధ్యత పూర్తికాదన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, ఆరోగ్యంపై అవగాహన, జీవిత లక్ష్యాల పట్ల స్పష్టత కల్పించాలని సూచించారు.

Advertisement

Also read: ఇంటిమేట్ సీన్స్‌లో అసలు మ్యాటర్ ఇదే.. విషయం చెప్పిన క్రేజీ డైరెక్టర్ !

12 వేల నియామకాలు..

ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 12 వేల మంది ఉపాధ్యాయుల నియామకమైనట్లు చెప్పారు. నల్లగొండలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల పనులు సుమారు 50 శాతం పూర్తయ్యాయని తెలిపారు.

నల్లగొండలో 9 శాతం పెరిగిన నమోదు..

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది విద్యార్థుల నమోదు తగ్గినప్పటికీ నల్లగొండ జిల్లాలో మాత్రం 9 శాతం పెరిగిందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్‌ పాఠశాలల వైపు విద్యార్థులు ఎందుకు వెళ్తున్నారనే అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. పదో తరగతి పూర్తిచేసిన తర్వాత ఇంటర్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అవుతున్న అంశాన్ని మంత్రి ప్రస్తావించారు. మధ్యలోనే చదువు మానేస్తున్న విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. డ్రాప్‌అవుట్‌ అవుతున్న విద్యార్థుల వివరాలను సేకరించి, వారు చదువు ఎందుకు కొనసాగించలేకపోతున్నారనే కారణాలను విశ్లేషించాలని సూచించారు.

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా రజనీకాంత్..

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ మోడల్ స్కూల్‌లో బాటనీ (పీజీటీ )ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బోయినపల్లి రజనీకాంత్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్‌నాయక్‌, శ్రీపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్
మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, డీఈఓ సుసింధర్‌రావు ఉన్నారు.

Also read: ఎమ్మెల్సీ ఎన్నికలకు కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

Tags

Related News

రేపు తెలంగాణకు భారీ వానగండం.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..?

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. మంత్రి వివేక్ కీలక ప్రకటన!

ఎమ్మెల్సీ ఎన్నికలకు కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

ఏసీబీకి చిక్కిన మంచిర్యాల గ్రామ పరిపాలనా అధికారి!

ప్రభుత్వ వైద్యం దయనీయం.. చిన్నారుల చావుల్లోనూ నిర్లక్ష్యమా?.. కవిత తీవ్ర ఆగ్రహం!

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పాపాల పుట్ట బద్దలు.. ఏసీబీ దాడుల్లో సంచలనాలు!

‘సర్’ ప్రక్రియ హాస్యాస్పదం.. ఈసీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు.. కాంగ్రెస్‌ వైఖరిపై ధ్వజం!

Big Stories

Advertisement
×