తాగుబోతులకు ఆనందాన్ని ఇచ్చే పథకం ఇది. మద్యం వినియోగదారులు ఆ మద్యాన్ని తాగేసాక ఖాళీ బాటిల్ ను తిరిగి ఇచ్చి కూడా డబ్బును పొందవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను పెట్టింది కేరళ. త్వరలో కేరళ రాష్ట్రంలో ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రారంభమవుతుంది. ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గించడం కోసం కేరళ ప్రభుత్వం ఈ పథకాన్ని పెట్టినట్టు చెబుతోంది.
బేవరేజర్స్ కార్పొరేషన్ తరపున డిపాజిట్ రిఫండ్ పథకాన్ని ప్రారంభించడానికి కేరళ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఆ మద్యం బాటిల్ గాజుతో తయారుచేసిన లేదా ప్లాస్టిక్ తో తయారు చేసిన కూడా డబ్బులు పొందవచ్చు.
ఒక బాటిల్ ఇస్తే క్యాష్ బాక్
కేరళ ప్రభుత్వం డిపాజిట్ రిఫండ్ పథకం కింద వినియోగదారులను ఖాళీ మద్యం బాటిల్ లో ఎక్కడా పడేయకుండా తిరిగి షాపుల వద్దకే తీసుకొచ్చి ఇవ్వమని కోరుతోంది. ప్రతి బాటిల్ పై 20 రూపాయలను పొందవచ్చని చెబుతోంది. అయితే నిబంధన ప్రకారం మద్యం బాటిల్ కొన్నప్పుడే 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తారు. దానివల్ల ఆ వ్యక్తి ఆ బాటిల్ ని ఎక్కడా పడేయకుండా తిరిగి క్యాష్ బ్యాక్ ఆఫర్ కోసం వచ్చే అవకాశం ఉంది. కస్టమర్ మద్యం తాగేసాక ఆ ఖాళీ బాటిల్ ని తిరిగి ఇస్తే 20 రూపాయలను వెనక్కి వాపసు పొందవచ్చు.
ఈ ప్రాజెక్టు త్వరలో కేరళ రాష్ట్రం మొత్తం ప్రారంభం అవ్వబోతుంది. పైలెట్ ప్రాజెక్టు కింద తిరువనంతపురం. కన్నూర్ జిల్లాలో ప్రారంభించారు. ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల పర్యావరణం తీవ్రంగా ప్రభావితం అవుతుందని, దాన్ని కాపాడడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ప్లాస్టిక్ బాటిల్ లేదా గాజు బాటిల్
కేరళ ప్రభుత్వం ఎనిమిది వందల కంటే తక్కువ ఖరీదైన మద్యం బాటిళ్లను ప్లాస్టిక్ బాటిల్ లోనే విక్రయిస్తోంది. అంతకన్నా ఎక్కువ ధర ఉంటే ఆ మధ్యాహ్నం గాజు బాటిళ్లలో అమ్ముతారు. అయితే మీరు మద్యం బాటిల్ ను ఎక్కడ కొంటారో తిరిగి అదే షాపుకు వెళ్లి ఆ బాటిల్ ను తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. ఆగస్టు 5న త్రిసూర్లో దీనికోసం మొదటి సూపర్ ప్రీమియం అవుట్లెట్లను ప్రారంభించబోతున్నారు. ఇక్కడ విదేశీ మద్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమ్మబోతోంది. దీని ధర 900 రూపాయలు కంటే ఎక్కువే ఉంటుంది. ఇలా కూడా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక్కడ కేరళలో ఈ పథకం సక్సెస్ అయితే మిగతా రాష్ట్రాలకు కూడా చేరే అవకాశం ఉంది. దీనివల్ల మద్యం బాటిల్ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అలాగే అదనపు రాబడిని కూడా పొందవచ్చు. నిజానికి ఇది క్యాష్ బ్యాక్ పథకమే అయినా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. వినియోగదారుడు 20 రూపాయలు అదనంగా చెల్లించి మద్యాన్ని కొని తిరిగి 20 రూపాయలను తిరిగి తీసుకుంటాడు.