E-Paper
Advertisement

బజాజ్ పల్సర్ NS400Z న్యూ వెర్షన్ వచ్చేసింది.. TFT డిస్‌ ప్లేతో లుక్ అదిరిపోయిందిగా!

బజాజ్ పల్సర్ NS400Z న్యూ వెర్షన్ వచ్చేసింది.. TFT డిస్‌ ప్లేతో లుక్ అదిరిపోయిందిగా!
Advertisement

Bajaj Pulsar NS400Z New Update: ప్రముఖ టూ వీలర్ కంపెనీ బజాజ్ తన ఫ్లాగ్‌షిప్ పల్సర్ మోడల్ NS400Zలో కీలకమైన అప్‌ డేట్ తీసుకొచ్చింది. కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసిన పల్సర్ NS400Zను కంపెనీ విడుదల చేసింది. రూ.1.90 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు మార్కెట్ కు పరిచయం చేసింది. ఈ కొత్త వెర్షన్‌ లో ప్రధాన ఆకర్షణగా 5 అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను తీసుకొచ్చింది. కొత్త డిస్‌ ప్లే కారణంగా బైక్‌ లో నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ లాంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. స్టాండర్డ్ NS400Zతో పోలిస్తే కొత్త మోడల్ ధర కేవలం రూ.4,000 మాత్రమే ఎక్కువగా ఉంది.

5 అంగుళాల TFT డిస్‌ప్లే!

కొత్త పల్సర్ NS400Zలో 5 అంగుళాల TFT డిస్‌ ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బజాజ్ ఇప్పటికే తన పల్సర్ సిరీస్‌లోని కొన్ని ఇతర మోడళ్లలో ఉపయోగిస్తున్న ఇదే TFT క్లస్టర్‌ను ఇప్పుడు NS400Zలోనూ అందించింది. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా స్మార్ట్‌ ఫోన్‌ను బైక్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ ద్వారా టర్న్ బై టర్న్ నావిగేషన్‌ను డిస్‌ ప్లేలో చూడొచ్చు. దీంతో ప్రయాణ సమయంలో ఫోన్‌ ను పదేపదే చూసే అవసరం తగ్గుతుంది.

మ్యూజిక్ కంట్రోల్, ల్యాప్ టైమర్

Advertisement

TFT డిస్‌ ప్లేలో నావిగేషన్‌ తో పాటు మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. రైడింగ్ సమయంలో పాటలను కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. డాక్యుమెంట్ స్టోరేజ్ లాంటి అదనపు కనెక్టెడ్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. మరో ఆసక్తికరమైన ఫీచర్ ల్యాప్ టైమర్. స్పోర్టీ రైడింగ్‌ ను ఇష్టపడే వారికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే ఫోన్ ఛార్జింగ్ కోసం USB టైప్ C పోర్ట్‌ ను కూడా బైక్‌లో కొత్తగా యాడ్ చేశారు.

పానిక్ బ్రేక్ అలర్ట్

భద్రతకు సంబంధించిన మరో కొత్త ఫీచర్ పానిక్ బ్రేక్ అలర్ట్. రైడర్ అకస్మాత్తుగా గట్టిగా బ్రేక్ వేసినప్పుడు ఈ సిస్టమ్ హజార్డ్ లైట్లను ఆటోమేటిక్‌గా ఆన్ చేస్తుంది. వెనుక నుంచి వచ్చే వాహనాలకు బైక్ ఒక్కసారిగా వేగం తగ్గించిన విషయం తెలియజేయడంలో ఉపయోగపడుతుంది.

ఇంజన్‌లో నో ఛేంజెస్   

Advertisement

కొత్త ఫీచర్లు వచ్చినప్పటికీ బైక్ మెకానికల్ ప్యాకేజీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. NS400Zలో 349cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కొనసాగుతోంది. ఈ ఇంజన్ 9,000rpm దగ్గర 40hp పవర్, 7,500rpm దగ్గర 33Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ గేర్‌ బాక్స్ ను యాడ్ చేశారు. ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీ, నాలుగు రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఫీచర్లు కూడా యథాతథంగా ఉన్నాయి.

 ధర ఎంతంటే?

కొత్త TFT డిస్‌ప్లేతో వచ్చిన బజాజ్ పల్సర్ NS400Z ధర రూ.1.90 లక్షలుగా నిర్ణయించింది.  స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే కేవలం రూ.4,000 ఎక్కువ.

Read Also: హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ప్రీ బుకింగ్స్ షురూ.. లాంచింగ్ ఎప్పుడంటే?

Tags

Related News

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ప్రీ బుకింగ్స్ షురూ.. లాంచింగ్ ఎప్పుడంటే?

జీప్ కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.4 లక్షల తగ్గింపు!

కార్ల మార్కెట్‌లో పండుగ జోష్.. సెప్టెంబర్‌ అమ్మకాల్లో బిగ్ జంప్.. టాప్ కంపెనీల సేల్స్ ఇవే!

హోండా కొత్త అడ్వెంచర్ స్కూటర్‌కు బ్రేక్.. ADV160 డెలివరీలు వాయిదా!

కారు నుంచి విమానం వరకు.. ఆటోపైలట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×