Vishnu Priya:విష్ణుప్రియ భీమనేని…మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో అరా కొరా సినిమాలు చేసినప్పటికీ బుల్లి తెరపై వచ్చిన పోరా పోవే తో ఒక్కసారిగా పాపులర్ అయింది.ముఖ్యంగా సుడిగాలి సుదీర్ తో కలిసి చేసిన ఈ షో అప్పట్లో ఆడియన్స్ లో ముఖ్యంగా యూత్ లో మంచి పేరు తెచ్చుకుంది.
ఇక ఆ తర్వాత వరుసగా షోలు ,ఈవెంట్స్ ,ప్రోగ్రామ్స్ అంతో తెగ బిజీగా గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ అప్ డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో నిరంతరం టచ్ లోనే ఉంటుంది.
ఆకుపచ్చ రంగు దుస్తుల్లో విష్ణు ప్రియ
ఇక ఈ క్రమంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ లో సముద్రపు ఆకుపచ్చ రంగు దుస్తుల్లో విష్ణు ప్రియ పెట్టిన ఫోటోలు ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఇక అందులో కేవలం ఫోటోని పెట్టి వదిలేయడమే కాకుండా రంగులకు మన మూడ్‌తో ఉన్న సంబంధాన్ని కూడా వివరించడం ఇక్కడ విశేషం.
విష్ణు ప్రియ పెట్టిన ఆ పోస్ట్ లో “సీ గ్రీన్ రంగు నా డస్కీ టోన్‌ను మరింత అందంగా చూపించడం నాకెంతో ఇష్టం. ప్రతి రంగుకూ ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది. అది మనలోని మరో కోణాన్ని బయటకు తీసుకొస్తుంది. మన అందం, మన మూడ్, మన ఆరా.. ఇలా ఒక్కో రంగు ఒక్కో అనుభూతిని ఇస్తుంది” అనే అర్థం వచ్చేలా పెట్టిన పోస్ట్ ఇపుడు ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది.
మాములుగా పోస్టులు పెట్టే సెలబ్రిటీలు ఎవరైనా తమ లుక్స్ పైనో లేక వేసుకున్న జ్యూవెలరీ పైనో లేకపోతే ,ధరించిన కాస్ట్యూమ్ పైనో ఎక్కువ ఫోకస్ పెట్టడం మనం చూస్తూనే ఉంటాం.కానీ విష్ణు ప్రియ మీద తన పోస్ట్ లో క్రేజీగా రంగుల గురించి డిస్కస్ చేయడం కాస్త ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి.
స్కిన్ టోన్‌ను మరింత హైలైట్ చేస్తున్న సీ గ్రీన్ కలర్
ముఖ్యంగా సీ గ్రీన్ కలర్ తన స్కిన్ టోన్‌ను మరింత హైలైట్ చేస్తుందని ఆమె చెప్పడం ఫ్యాషన్ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక ట్రెడిషనల్ లుక్‌కు మోడ్రన్ టచ్ ఇస్తూ వేసుకున్న డ్రెస్ జ్యూవెలరీ,హెయిర్ స్టైల్ అన్నీ కలిపి ఈ భామకి ఒక రాయల్ ఫీల్‌ను తీసుకొచ్చాయనడంలో సందేహం లేదు.
విష్ణుప్రియ భీమనేని విషయానికి వస్తే టీవీలో ఎంటర్ టైన్ మెంట్ షోలతో బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ చెక్, ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’, ‘దయా’, ‘వాంటెడ్ పండుగాడ్’ ‘ది 100’వంటి సినిమాలలో కనిపించి మెప్పించింది. ముఖ్యంగా ‘దయా’లో షబానా పాత్రలో విష్ణుప్రియ చేసిన నటనకి మంచి పేరు వచ్చింది కూడా. ఇక రీసెంట్ గా అల్లరినరేష్ హీరోగా వచ్చిన ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’లో విష్ణుప్రియ ఊర్వశి పాత్రలో కనిపించడం విశేషం.
ఇంకెన్ని సంచలనాలకి తెర తీస్తుందో !
also read :ఆట సందీప్ ఒక్కో పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా?
మొత్తంగా యాంకర్ గా మొదలైన విష్ణు ప్రియ జర్నీ ఇపుడు సినిమాలు , ఎంటర్ టైన్ మెంట్ షోస్, వెబ్ సిరీస్ అంటూ వరుస ప్రాజెక్ట్ లతో సాగిపోతుంది. ఇక తాజాగా ఇంస్టాలో విష్ణు ప్రియ పెట్టిన పోస్ట్ కి నెట్టింట క్రేజీగా కామెంట్ల వర్షం కురవడంతో ఈ భామ పేరు ఇపుడు మారు మ్రోగిపోతుంది. చూడాలి మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మ ఇంకెన్ని సంచలనాలకి తెర తీస్తుందో !