E-Paper
Advertisement

బాలీవుడ్ డెబ్యూకి సిద్ధమైన చందు మొండేటి..పూర్తి డీటెయిల్స్ ఇవే!

బాలీవుడ్ డెబ్యూకి సిద్ధమైన చందు మొండేటి..పూర్తి డీటెయిల్స్ ఇవే!
Advertisement

Chandu Mondeti: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ చందుమొండేటి (Chandu Mondeti) ఒకరు. కార్తికేయ 2, తండేల్ వంటి సినిమాల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. చందు మొండేటి తన తదుపరి సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈయన సినిమాకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంజయ్ లీలా భన్సాలీ కథతో…

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) రూపొందించిన కథ ద్వారా ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar), టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి(Rana Daggubati) ప్రధాన పాత్రలలో ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. ఈ సినిమా మైథాలాజికల్ నేపథ్యంలో రాబోతోందని తెలుస్తోంది.

మహాకాళ్ టైటిల్ పరిశీలన…

Advertisement

ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ కథ అందించడమే కాకుండా, ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి “మహాకాళ్” (Mahakaal)అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇలా సంజయ్ లీలా భన్సాలీ కథతో, ఆయన నిర్మాణంలోని చందు మొండేటి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది.

వాయుపుత్ర పనులలో బిజీగా డైరెక్టర్..

ఇక చందు మొండేటి ప్రస్తుతం ప్రాజెక్టు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన భారీ పౌరాణిక 3D యానిమేషన్ సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆంజనేయుడి కథ ఆధారంగా రాబోతున్న వాయుపుత్ర సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన అనంతరం చందు మొండేటి మహాకాళ్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న చందు మొండేటి ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అక్కడ ఆయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోలు భాగం అవుతున్న నేపథ్యంలో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement

Also Read: రణబాలి సెకండ్ డాక్యుమెంటరీ ‘ది హిస్టరీ వుయ్ ఫర్ గాట్’ రిలీజ్!

Related News

రణబాలి సెకండ్ డాక్యుమెంటరీ ‘ది హిస్టరీ వుయ్ ఫర్ గాట్’ రిలీజ్!

ఆట సందీప్ ఒక్కో పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా?

ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

బిగ్ బాస్ కృష్ణుడు కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో?

ఎఫ్డిఏ నోటీసులపై షారుక్ , అజయ్ , టైగర్ ష్రాఫ్ రియాక్షన్?

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫెడరేషన్ కీలక నిర్ణయం!

‘ రాకా’ విషయంలో కీలక మార్పులు.. రెండు భాగాలుగా రాబోతోందా?

Big Stories

Advertisement
×