Aata Sandeep Remuneration:సందీప్ అనగానే అంత ఈజీగా గుర్తుపట్టరేమో కాని ఆట సందీప్ అనగానే ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఆట అనే రియాలిటీ షో నే తన ఇంటి పేరుగా మలుచుకున్న ఈ క్రేజీ కొరియోగ్రాఫర్ ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నాడనే చెప్పాలి.మరి చిన్న చిన్న సినిమాల ద్వారా ఎదుగుతూ ఇపుడు స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ అందించే స్థాయికి వచ్చిన ఆట సందీప్ ఒక్కో పాటకి ఎంత తీసుకుంటాడో చూసేద్దాం.
ప్రస్తుతం సందీప్ కి ఉన్న డిమాండ్ బట్టి చూస్తే ఆయన ఒక్కో పాటకి దాదాపు 6 నుండి 7 లక్షల వరకు చార్జ్ చేస్తున్నాడని ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.అయితే స్టార్ హీరోకి ఈ రేటు మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.అవును..షూటింగ్ భారీ స్థాయిలో ఉండటం, ఎక్కువ కాల్ షీట్స్ కేటాయించే అవసరం ఏర్పడటం మూలానా ఒక్కో పాటకి పది లక్షలు చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది,అయితే ఇవి అఫీషియల్ గా కాకుండా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు గానే పరిగణించాల్సి ఉంటుంది.
ఇక ఆట సందీప్ కెరీర్ లో ముఖ్యమైన సాంగ్స్ గా చెప్పుకోవాల్సి వస్తే సందీప్ కి మొదటగా గుర్తింపు తెచ్చిన పాట ‘గిర గిర గిర గింగిరానివే పాటని చెప్పుకోవాలి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వైజయింతి మూవీస్ బ్యానర్ పై రోషన్ హీరోగా తెరకెక్కిన చాంపియన్ సినిమాలోని ఈ పాటతో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా గద్దర్ అవార్డ్ కూడా అందుకున్నాడు సందీప్.ఒక రకంగా పెద్ద హీరోలకి కొరియోగ్రాఫర్ గా అవకాశం రావడానికి ఈ పాటనే ప్రధాన కారణం అని చెప్పాలి.
ఇక ఆ తర్వాత చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో చిరు కోసం డిజైన్ చేసిన హుక్ స్టెప్ పాట ఆడియన్స్ ని ఒక ఊపు ఊపింది. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన సందీప్ కి చిరుకి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ దక్కడం అంటే సందీప్ పడ్డ కష్టానికి సరైన ఫలితం దక్కిందనే చెప్పాలి.
ఇకపొతే అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని జయ కృష్ణ హీరోగా తెరంగేట్రం చేసిన ‘శ్రీనివాస మంగాపురం’సినిమాలోని ‘అలెల్లె అలెల్లె’ సాంగ్ కి అలాగే ‘సమ్మర్ హాలిడేస్’లోని ‘స్కూల్ సాంగ్’ వంటి పాటలకు సందీప్ చేసిన కొరియోగ్రఫీ మంచి పేరే తెచ్చుకుంది.
ఇక అన్నింటికి మించి తాజాగా ‘ది ప్యారడైజ్’లోని ‘ఏష నాగుల కట్టమీద’సాంగ్ సందీప్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ అని చెప్పాలి. . నాని, కీర్తి సురేష్ జోడీగా జంగిరెడ్డి పాడిన ఈ పాటను తెలంగాణ ఫోక్ ఫ్లేవర్‌తో స్టెప్స్ కంపోజ్ చేసి సాంగ్ పై తనదైన ముద్ర వేశాడు సందీప్.అయితే మొదట్లో పాటకి స్లో గా ఉందని నెగెటివ్ టాక్ వచ్చినా రాను రాను ఈ పాట చార్ట్ బస్టర్ అవ్వడం విశేషం. చూడాలి మరి ముందు ముందు ఈ క్రేజీ కొరియోగ్రాఫర్ ఇంకెన్ని సంచలనాలు స్ప్రుష్టిస్తాడో !’
also read :జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫెడరేషన్ కీలక నిర్ణయం!