Nakshatra – Women: ఆ అయిదు నక్షత్రాల్లో పుట్టిన మహిళలు ఎప్పటికైనా చరిత్ర సృష్టిస్తారట. వారు ఎంచుకున్న రంగంలో వారికి తిరుగే ఉండదట. అయితే ఇప్పటి వరకు చరిత్రలో గొప్ప వ్యక్తులుగా ఎదిగిన మహిళలు కూడా ఎక్కువగా ఆ నక్షత్రాల్లోనే పుట్టారట. ఇంతకీ ఆ నక్షత్రాలు ఏవీ అందులో పుట్టిన మహిళల ప్రత్యేక ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన మహిళలు ఎప్పటికైనా గొప్పవారు అవుతారట. వారికి జీవితంలో ఎదురే ఉండదట. ఎటువంటి సమస్యనైనా తమకున్న శక్తి సామర్థ్యాలతో పరిష్కరిస్తారట. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందే మహిళలందరూ కూడా అవే నక్షత్రాల్లో పుట్టి ఉంటారనేది జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఆ నక్షత్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
అశ్విని నక్షత్రం: ఈ నక్షత్రంలో పుట్టిన మహిళలు స్వతంత్ర భావజాలం ఎక్కువగా ఉంటుంది. బలమైన సంకల్పం కలిగి ఉంటారు. వీరు అత్యవసర సమయంలోనైనా సరే వేగవంతమైన ఆలోచనలు చేయగలరు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడూ అందరి కంటే ముందే ఉండాలని బలంగా కోరుకుంటారు. ఈ నక్షత్ర జాతకులు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వీరే ముందుంటారు.
భరణి నక్షత్రం: ఈ నక్షత్ర జాతకులకు శుక్రుడి ఆశీస్సులు నిండుగా ఉంటాయి. అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన మహిళలు అందాన్ని మాత్రమే కాదు అసాధారణమైన ఆత్మగౌరవాన్ని కూడా కలిగి ఉంటారు. బయటకు సున్నితంగా కనిపించినా లోపల శక్తివంతమైన ధృడత్వం కలిగి ఉంటారు. అయితే ఈ నక్షత్రంలో పుట్టిన చాలా మంది మహిళలు నిబంధనలు అసలు పాటించరు. కానీ కొత్త నిబంధనలు సృష్టించడంలో వీరు సిద్ద హస్తులు.
మఖా నక్షత్రం: ఈ నక్షత్రంలో పుట్టిన మహిళలకు కేతు గ్రహ ప్రభావంతో సహజమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరిలో పరిపక్వత అధికంగా ఉంటుంది. వీరికి మూలాల నుంచే కీర్తి వస్తుంది. రిలేషన్స్‌లో రెస్పెక్ట్ లేకపోతే అసలు సహించారు ఆ రిలేషన్స్ వదులుకోవడానికి కూడా వెనకాడరు. సమయ పాలన పాటిస్తారు. విలువ ఉన్న చోటే వీరు ఉంటారు.
స్వాతి నక్షత్రం: ఈ నక్షత్ర జాతకులకు వాయుదేవుని ఆశీస్సులు ఉంటాయి. దీని కారణంగా ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన మహిళలకు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వీరి చాలా సౌమ్యంగా ఉంటారు. ఏదైనా విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరు ముందుంటారు. మారే గాలిలా వీరు తమ జీవితాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తే అది వారి దారినే మార్చేస్తుంది. అయితే వీరి దిశను ఎవ్వరూ నిర్ణయించలేరు.
మూల నక్షత్రం: ఈ నక్షత్ర జాతకులకు నిర్బతి దేవత ఆశీర్వాతం ఉంటుంది. వీరికి లోతైన ఆలోచనా శక్తి ఉంటుంది. మూలా నక్షత్ర జాతక మహిళలు సత్యం కోసం అన్వేషిస్తారు. అబద్దాలు చెప్పడం వీరికి చేతకాదు. రిలేషన్స్ పెరగడానికి వీరు కృషి చేస్తారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడే రకం కాదు వీరు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు