BigTV English
Advertisement

Gaddar Awards: అటు బన్నీ.. ఇటు రేవంత్.. మధ్యలో బాలయ్య.. సందడి మాములూగా లేదుగా!

Gaddar Awards: అటు బన్నీ.. ఇటు రేవంత్.. మధ్యలో బాలయ్య.. సందడి మాములూగా లేదుగా!

Gaddar Awards: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి గద్దర్ అవార్డులను(Gaddar Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సినీ సెలబ్రిటీలను ప్రోత్సహిస్తూ వారిని గౌరవిస్తూ ఏ విధమైనటువంటి అవార్డులను ప్రకటించలేదు. గతంలో నంది అవార్డులను ప్రకటించేవారు. ప్రస్తుతం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రకటించారు. తాజాగా ఈ అవార్డు వేడుకలో హైదరాబాద్లోనే హైటెక్ సిటీలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరై సందడి చేస్తున్నారు.


స్పెషల్ అట్రాక్షన్ గా రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్..

ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గద్దర్ అవార్డులను ప్రధానం చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్(Allu Arjun) బాలకృష్ణ(Balakrishna) ఈ ముగ్గురు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.అల్లు అర్జున్ సైతం పుష్ప సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో బాలకృష్ణ, అల్లు అర్జున్ ఇద్దరూ కూడా ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు.


సందడిగా మారిన గద్దర్ అవార్డుల వేడుక…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడంతో ఒక్కసారిగా ఈ వేడుక మరింత సందడిగా మారిపోయింది. ఇక రేవంత్ రెడ్డి రావడంతోనే బాలకృష్ణను ఆలింగనం చేసుకొని పలకరించారు. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా రేవంత్ రెడ్డిని పలకరించారు. ఇలా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లిన వెంటనే బాలకృష్ణ పక్కన కూర్చుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఇలా వరుసగా అల్లు అర్జున్, బాలకృష్ణ రేవంత్ రెడ్డి కలిసి ఈ కార్యక్రమంలో కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు తర్వాత మొదటిసారి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఈ గద్దర్ అవార్డుల వేడుకలలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా…

పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇలా ఈ ఘటన తర్వాత సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డితో కలిసి బేటి అయ్యారు కానీ కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ రేవంత్ రెడ్డిని కలవలేకపోయారు. అయితే తాజాగా ఈ గద్దర్ అవార్డు వేడుకలలో భాగంగా ఈ ఇద్దరు ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఇలా అల్లు అర్జున్ ఈ అవార్డుకు ఎంపిక కావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వేడుక ఎంతో సందడిగా అంగరంగ వైభవంగా జరుగుతుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×