E-Paper
Advertisement

యూట్యూబర్ నందన దంపతులకు మరో షాక్.. బిగుస్తున్న ఉచ్చు!

యూట్యూబర్ నందన దంపతులకు మరో షాక్.. బిగుస్తున్న ఉచ్చు!
Advertisement

Youtuber Nandana: యూట్యూబర్ నందన గత కొద్ది రోజులుగా వీసా స్కాంలో భాగంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె తన భర్త మధుకర్ కలిసి విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితుల వద్ద కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారు. దీంతో బాధితులు పెద్ద ఎత్తున ఈ దంపతులపై పోలీసులకు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియా వచ్చిన నందన పోలీస్ విచారణలో పాల్గొంటున్నారు. అయితే రోజురోజుకు ఈ దంపతుల మెడకు ఉచ్చు బిగుస్తోందని చెప్పాలి. తాజాగా వీసా స్కామ్ లో భాగంగా మోసపోయిన బాధితులందరూ తెలంగాణ సీఎం ప్రజావాణికి ఫిర్యాదు చేశారు.

ఒక్కొక్కరి నుంచి రూ.25 – రూ.95 లక్షల వరకు వసూలు ..

యూకేలో స్థిరపడిన యూట్యూబర్ నందన, ఆమె భర్త మధుకర్ ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపిస్తూ పలువురు బాధితులు తెలంగాణ సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.యూకే ప్రభుత్వం తమ కన్సల్టెన్సీ కంపెనీకి ఉద్యోగులను నియమించుకునే అనుమతి ఇచ్చిందంటూ బాధితులను నమ్మించి మోసం చేస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.కన్సల్టెన్సీ సంస్థ సమర్పించిన పత్రాలు నకిలీవని తేలడంతో పలువురు బాధితులు యూకేలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

తెలంగాణ సీఎం ప్రజావాణిలో ఫిర్యాదులు..

Advertisement

ఇలా యూట్యూబర్ నందన మధుకర్ దంపతులు చేసిన ఈ స్కాం లో భాగంగా తెలంగాణలో వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్‌తో పాటు ఏపీ, గుజరాత్ నుంచి కూడా బాధితులు ఉన్నట్లు వెల్లడించారు. ఇలా మధుకర్ నందన చేసిన ఈ స్కాం పట్ల బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదులు చేయడంతో ప్రజావాణి ఇన్‌చార్జి గద్వాల విజయలక్ష్మి, అధికారులు విద్యాసాగర్, డా. వినోద్ కుమార్‌ తన పూర్తి సహకారం అందిస్తామని బాధితులకు భరోసా కల్పించారు. ఈ విధంగా వీరిపై ఫిర్యాదులు ప్రజావాణికి వెళ్లడంతో నందన మధుకర్ పై కేసు తీవ్రతరం అవుతుందని తెలుస్తోంది.

న్యాయం కోసం సుప్రీంకోర్టుకు నందన..

ఇండియా వచ్చిన నందన ఇప్పటికే రెండుసార్లు పోలీసు విచారణలో పాల్గొన్నారు. అయితే ఈమె ఈ వ్యవహారం మొత్తం తన భర్తకే తెలుసు తనకు ఏమాత్రం తెలియదని పోలీసుల ముందు తెలిపారు. అదేవిధంగా తనపై ఉన్నటువంటి లుక్ అవుట్ నోటీసులను ఎత్తివేయాలని తిరిగి తాను కెనడా వెళ్లిపోతానని ఈమె పోలీసులను కోరారు. ఇక ఈ వ్యవహారంలో భాగంగా నందన భర్త మధుకర్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు ఈయన అజ్ఞాతంలో ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ స్కాం వ్యవహారంలో భాగంగా ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి? ఈ కేసు నుంచి నందన దంపతులు ఎలా బయటపడతారు అనేది తెలియాల్సింది. ఇక ఈ దంపతులు కూడా న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చేవరకు ఈ విషయంపై ఎక్కడా స్పందించమని నందనకు సంబంధించి ఒక ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: భారీ ధరకు ‘జనవరి 12 విడుదల’ ఓటీటీ రైట్స్..వెంకీ కెరీర్ లోనే హైయెస్ట్!

Related News

‘ఢీ’ షో వచ్చాకే మార్పు మొదలైందా.. ఉదయభాను షాకింగ్ ఫ్యాక్ట్స్ రివీల్!

10 కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ వెళ్ళను..కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 10 లో కంటెస్టెంట్!

బిగ్ బాస్ 10 లవ్ ట్రాక్స్..విన్నర్ ఎవరో చెప్పిన కృష్ణుడు!

“నిజం ఎప్పుడూ దాగదు”.. మాధురి రాథోడ్ సంచలన పోస్ట్!

బిగ్ బాస్ 10 3వ వారంలో నామినేట్ అయ్యింది వీరే.. అయ్యో వీరు కూడానా?

డైలీ 10 కేజీల స్వీట్స్ తింటాను..నరకం చూసాను.. కన్నీళ్లు పెట్టిస్తున్న కృష్ణుడు మాటలు!

సుధీర్ పై సృష్టి ఫైర్.. మరీ అంత ఫ్లర్ట్ చేశాడా?

Big Stories

Advertisement
×