E-Paper
Advertisement

చిన్న రూమ్.. తక్కువ బడ్జెట్.. రూ. 10,000 లోపే లభించే టాప్-5 మినీ ఫ్రిడ్జ్‌లు!

చిన్న రూమ్.. తక్కువ బడ్జెట్.. రూ. 10,000 లోపే లభించే టాప్-5 మినీ ఫ్రిడ్జ్‌లు!
Advertisement

Mini Refrigerators: బ్యాచిలర్ లైఫ్ గడిపే వారికి, చిన్న గదుల్లో నివసించే వారికి పెద్ద ఫ్రిడ్జ్ కొనుగోలు చేయడం ఆర్థికంగా, స్థలం దృష్ట్యా కాస్త ఇబ్బందితో కూడుకున్న విషయమే. అలాంటి వారి కోసం రూ. 10,000 బడ్జెట్‌లోనే లభించే కొన్ని బెస్ట్ మినీ రిఫ్రిజిరేటర్లు ఈ కథనంలో అందించడం జరుగుతోంది. మీ అవసరాలకు తగ్గట్లుగా ఉన్న వాటిని మీరే ఎంచుకోండి.

1. బ్లూ స్టార్ MR60-GB (45 లీటర్లు)

ఏసీలు, కూలింగ్ పరికరాల తయారీలో బ్లూ స్టార్ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. ఈ 45 లీటర్ల మినీ ఫ్రిడ్జ్ 2 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. చిన్న గదుల్లోనూ సరిగ్గా సరిపోతుంది. నీళ్ల బాటిళ్లు, స్నాక్స్, పాలు వంటివి దాచుకోవడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. డిజైన్ పరంగా కూడా ఇది చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది.

2. హయ్యర్ 50L డైరెక్ట్ కూల్ మినీ బార్

Advertisement

హయ్యర్ బ్రాండ్‌కు చెందిన ఈ 50 లీటర్ల మినీ ఫ్రిడ్జ్ బ్యాచిలర్లకు చక్కగా సరిపోతుంది. 2 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉన్న ఈ రిఫ్రిజిరేటర్ డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో కూలింగ్ త్వరగా అవ్వడమే కాకుండా బాటిళ్లను స్టోర్ చేయడానికి ప్రత్యేక డోర్ ర్యాక్‌లు కూడా ఉన్నాయి.

3. రాక్‌వెల్ MB49 బ్లాక్ మినీ ఫ్రిజ్

స్టైలిష్ లుక్ ఇష్టపడే వారికి రాక్‌వెల్ MB49 ఒక మంచి ఆప్షన్. నాణ్యమైన కంప్రెసర్‌తో వచ్చే ఈ ఫ్రిజ్.. చాలా వేగంగా కూలింగ్‌ను అందిస్తుంది. రూమ్‌లో ఒక మూలన పెట్టినా లేదా టేబుల్‌పై ఉంచినా ఇది సెట్ అయిపోతుంది.

4. షార్ప్ 50L డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్

Advertisement

ఈ 50 లీటర్ల మినీ ఫ్రిజ్.. 2 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఇది తక్కువ విద్యుత్‌ను ఉపయోగిస్తూనే ఎక్కువ సమయం కూలింగ్‌ను నిలిపి ఉంచుతుంది. తక్కువ శబ్దంతో పనిచేయడం దీని మరో ప్రత్యేకత.

Also Read: ఒకే ఒక్క తప్పిదం.. ఎడారిలో ఏర్పడ్డ ‘బుల్లి సముద్రం’.. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

5. గోద్రేజ్ క్యూబ్ (30 లీటర్లు)

ఇది సాంప్రదాయ కంప్రెసర్ ఫ్రిడ్జ్ లకు భిన్నంగా ‘అడ్వాన్స్‌డ్ థర్మోఎలెక్ట్రిక్ టెక్నాలజీ’తో రూపొందింది. ఇందులో కంప్రెసర్ ఉండదు కాబట్టి ఎలాంటి శబ్దం రాదు. పాలు, పండ్లు, నీళ్ల బాటిళ్లు, కాస్మొటిక్స్ వంటి చిన్న చిన్న వస్తువులను చల్లగా ఉంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

Also Read: జియో యూజర్లకు పండగే పండగ.. ఏడాది పాటు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. 18 నెలల గూగుల్ జెమిని ప్రో!

Tags

Related News

ఈ ఎయిర్ ఫ్రైయర్ ఉంటే..నూనె లేకుండానే కరకరలాడే స్నాక్స్ రెడీ!

బడ్జెట్ ధరలో ఊరమాస్ సౌండ్! జెబ్రానిక్స్ స్పీకర్‌పై సూపర్ డీల్!

ప్రతి మహిళ మెచ్చే లగ్జరీ స్మార్ట్‌వాచ్..నాయిస్ నుంచి మరో అద్భుతమైన గాడ్జెట్!

మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ నుంచి..సూపర్ ఇయర్‌బడ్స్

ఇప్పుడు మిస్ అయితే జీవితంలో..ఈ ఆఫర్ మళ్లీ రాదు!

శాంసంగ్ నుంచి అద్దిరిపోయే ఇయర్‌బడ్స్!’Galaxy Buds4 Pro’పై భారీ డిస్కౌంట్

జియో యూజర్లకు పండగే పండగ.. ఏడాది పాటు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. 18 నెలల గూగుల్ జెమిని ప్రో!

Big Stories

Advertisement
×