Airport: విమానాశ్రయం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ విమానం సముద్రంలోనే కుప్పకూలిపోయే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన అజాక్సియా ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. పారిస్ నుంచి అజాక్సియాకు బయలుదేరిన విమానం ల్యాండ్ అయ్యేందుకు సిద్దమైంది. అయితే ల్యాండింగ్‌కు సిగ్నల్ ఇవ్వాల్సిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది నిద్రపోవడంతో విమానం సముద్రంపైనే చక్కర్లు కొట్టింది. అలా 20 నిమిషాల పాటు తిరుగుతూనే ఉంది. విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కొద్ది సేపటికి అప్రమత్తమైన ఉన్నతాధికారులు.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు చర్యలు తీసుకున్నారు.