Bhadradri kothagudem: తల్లి బంగారం.. అన్నదమ్ముల మధ్య చిచ్చురేపింది. చివరికి దారుణంగా కొట్టుకునే వరకు చేరింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురంలో చోటుచేసుకుంది. కొద్ది రోజుల కిందట అనారోగ్య సమస్యలతో తల్లి మరణించింది. దీంతో అన్న నాగిరెడ్డి, తమ్ముడు రామకృష్ణ రెడ్డి మధ్య ఆస్తి కోసం వాదన జరిగింది. ఈ నేపథ్యంలో నాగిరెడ్డి కుటుంబం పై రామకృష్ణ కుటుంబం దాడికి పాల్పడ్డారు. నాగిరెడ్డి భార్య, కుమారుడుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని..ఇరు కుటుంబాలను అదుపులోకి తీసుకున్నారు.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.