Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సు నేపథ్యంలో ఆటో కార్మికులు గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అమలు చేసిన ఆటో మిత్ర పథకానికి పెట్టిన ఆంక్షలు ఎత్తేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.30 వేల ఆర్థిక సాయం ప్రకటించాలని కోరుతున్నారు. జీఓ నెంబర్ 21ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో కార్మికుల సంఘం నేడు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు ధర్నా చేపట్టారు.