YS Jagan Convoy: వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వద్ద ఈడుపుగలు వద్ద దెబ్బతిన్న వరి, బొప్పాయి పంటలను పరిశీలించడానికి వస్తున్న క్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయిల్లో ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీటిలో ఒకటి ఎస్కార్ట్ వాహనం.. మరొకటి వైసీపీకి చెందిన వాహనం . ఈ క్రమంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.