BigTV English

102 Year Old Cricketer: 102 ఏళ్ల వయస్సులో క్రికెట్ ఆడుతూ.. హల్చల్ చేస్తున్న వృద్ధుడు!

102 Year Old Cricketer: 102 ఏళ్ల వయస్సులో క్రికెట్ ఆడుతూ.. హల్చల్ చేస్తున్న వృద్ధుడు!

102 Year Old Cricketer in Jammu Kashmir: ఆయన వయస్సు ఏ 70.. 80 యో అనుకునేరూ..? పొరపడినట్లే అవుతుంది. ఎందుకంటే ఆయన వయస్సు అక్షరాల నూటారెండు సంవత్సరాలు. 102 ఏళ్లున్న ఈ వృద్ధుడు గ్రౌండ్ లోకి దిగి క్రికెట్ ఆడిండంటే.. అంతా అవాక్కవ్వాల్సిందే. అందుకే ఆయన ఆడుతుంటే అక్కడి యువతా ఆశ్చర్యపోయి కళ్లార్పకుండా చూశారు. ఆయన ఆడుతుంటే ఏ ప్రముఖ క్రికెటరో ఆడుతున్నట్టు అనిపిస్తుంటది. వయస్సులో ఆయన సెంచరీ మార్కును దాటినప్పటికీ అతను క్రికెట్ లో కూడా చురుకుగా పాల్గొన్నాడు. క్రికెట్ ఎంతగానో ఆదరించే ఈ వృద్ధ క్రికెటర్ మైదానంలో క్రికెట్ ఆడుతూ యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు.


ఈయన పేరు హాజీ కరమ్ దిన్. ఈయన వయస్సు 102 ఏళ్లు. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాకు చెందిన హాజీ కరమ్ కు గౌరవప్రదమమైన వ్యక్తిగా మంచిగా గుర్తింపు ఉంది. అయితే, ఆయనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన క్రికెట్ ను ఎంతగానో ఆదరిస్తారు. 102 ఏళ్ల వయసులో కూడా ఆయన క్రికెట్ ఆడి స్థానిక యువతకు, యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఆయన క్రికెట్ ఆడుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఆయన వీడియోలు చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

అయితే, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్ లోని యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన మాట్లాడుతూ పలు విలువైన సూచనలు చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా యువతరానికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు అడుగులు వేయాలని సూచించారు.


Also Read: ఎంత మంచి మనసు బాస్ నీది.. వికలాంగుడిని క్షణాల్లో వ్యాపారవేత్తను చేశాడు..

అంతేకాదు.. ఆయన ఏప్రిల్ 26న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల ఆయనకున్న నిబద్ధతకు గౌరవ సూచకంగా పోలింగ్ కేంద్రం వద్ద ఆయనకు ఎన్నికల అధికారి పూలతో స్వాగతం పలికారంటా. ఓటింగ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. 102 ఏళ్ల వయస్సులో కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం హాజీ కరమ్ దిన్ క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చేతులకు గ్లౌజులు, కాళ్లకు ప్యాడ్లు కట్టుకుని చేతిలో బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వచ్చి ఆయనకు ఓ కుర్రవాడు బాల్ వేశాడు. ఆయన చక్కగా బ్యాటింగ్ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వాహ్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తూ హాజీ కరమ్ దిన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

Viral News: రాత్రయితే నాగినిగా మారి కాటేస్తున్న భార్య.. కలెక్టర్ కు భర్త ఫిర్యాదు!

Viral Video: ఓయమ్మా.. మోడీఫై స్కూటర్.. రంగురంగుల లైట్లతో ఎంత బాగా మెరిసిపోతుందో?

Viral Video: కోడికి కొత్త రెక్కలు.. డ్రోన్‌తో ఎలా ఎగిరిందో చూడండి!

Central Jail: రాజభోగాలుగా సెంట్రల్ జైలు.. అండ‌ర్ ట్రయల్ ఖైదీ బర్త్ డే వేడుకలు, వీడియో వైరల్

Viral video: ఈ బుడ్డోడు జాతీయ గీతాన్ని ఎంత చక్కగా ఆలపించాడో.. మీరు కూడా చూసేయండి బ్రో, వీడియో మస్త్ వైరల్

Viral Video: బెడ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎలుగుబంటి.. వెంటనే ఆ మహిళ ఏం చేసిందంటే?

Viral Video: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

iPhone Kidney: కిడ్నీ అమ్మేసి మరీ ఐఫోన్ కొన్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో దయనీయ స్థితిలో..

Big Stories

×