Viral Video: భార్య కోరిక విచిత్రంగా ఉంటాయి.. కాకపోతే అవి చిన్నవి కూడా. అలాంటి కోరిక తీర్చకుంటే అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా ఫైర్ అవుతారు. ఆ తర్వాత ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో చెప్పలేదు. కొత్త పెళ్లయిన దంపతుల మధ్య జరిగింది. పెద్దల సమక్షంలో ఒకరిపై మరొకరు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. యూపీలో వెలుగులోకి వచ్చిన అసలు మేటరేంటి? కాస్త లోతుల్లోకి వెళ్తే..
యూపీలోని పిలిభిత్ జిల్లా భగవంతపూర్ గ్రామానికి చెందిన శివమ్- సంగీత వివాహం చేసుకున్నారు. మే నాలుగో వారంలో వీరికి వివాహం జరిగింది. సంసారం బాగానే సాగుతోంది. అయితే భార్య సంగీతకు ఆగష్టు 30న తన భర్తకు మనసులోని కోరికను చెప్పింది. అందుకు అతగాడు సరేనని అన్నారు. ఇంతకీ ఆమె కోరిక ఏంటో తెలుసా?
సమోసా తినాలని ఉందని బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు తీసుకురావాలని చెప్పింది. పని ఒత్తిడిలో మరిచిపోయిన శివమ్, సమోసా లేకుండానే ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాడు. ఇక అక్కడి నుంచి భార్యభర్తల మధ్య రచ్చ మొదలైంది. దంపతుల మధ్య మొదలైన మాటామాటా చివరకు గాలివానగా మారింది. కోపంతో ఊగినపోయిన భార్య, తన భర్తను కుమ్మేసింది.
ఆ రాత్రి భోజనం చేయకుండా అలాగే నిద్రపోయాడు శివమ్. కానీ వారి మధ్య ఘర్షణ కంటిన్యూ అయ్యింది. చివరకు సంగీత తన తల్లిదండ్రులు ఇంటికి పిలిచింది. మరుసటి రోజు ఈ విషయంపై పంచాయతీ వరకు వెళ్లింది. ఆగస్టు 31న గ్రామ పెద్ద సమక్షంలో పంచాయతీ జరుగుతోంది.
ALSO READ: ఇక్కడ యువకులకు పెళ్లి నిల్.. పక్షులకు మాత్రం గ్యారెంటీ
దంపతుల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో మళ్లీ భార్య తండ్రిపై విరుచుకుపడ్డాడు అల్లుడు. ఇరుకుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా భర్తతోపాటు మరో నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. కేవలం సమోసా కోసం ఈ స్థాయి ఘర్షణ తలెత్తడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి చిన్న విషయాలకు భార్యాభర్తలు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని అంటున్నారు. ఫలితంగా ఇద్దరి మధ్య విబేధాలకు కారణమైందని అంటున్నారు.
पीलीभीत में पत्नी ने अपने पति से समोसा खाने की डिमांड की…लेकिन पति समोसा लाना भूल गया, जिसके बाद पत्नी ने अपने मायके पक्ष के लोगों को बुलाकर पति के साथ जमकर मारपीट की…वीडियो वायरल@pilibhitpolice@Uppolice#Pilibhit #UP #VideoViral pic.twitter.com/IOkBU2Qc7I
— Gaurav Kumar (@gaurav1307kumar) September 3, 2025