Meenakshi: ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే నటీనటులు కాస్త చనువుగా కనిపించారంటే చాలు.. వారి మధ్య లేని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు నెటిజన్స్. అయితే అప్పుడప్పుడు ఆ రూమర్స్ పై సెలబ్రిటీలు స్పందించినా.. రూమర్స్ మాత్రం ఆగడం లేదు. దీనికి తోడు ఆ సెలబ్రిటీలు కూడా మళ్లీ ఏదో ఒక సందర్భంలో కలిసి కనిపించడంతో వాటికి మరింత ఆజ్యం పోసినట్టు అవుతోంది. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో.. హీరోయిన్ మీనాక్షి చౌదరి అక్కినేని హీరో సుశాంత్ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను గతంలోనే మీనాక్షి ఖండించింది. అప్పుడు ఎవరు నమ్మలేదు కానీ ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ నిజమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి..అక్కినేని హీరో సుశాంత్ ఎయిర్పోర్టులో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పటినుంచో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రాగా ఇప్పుడు ఎయిర్పోర్టులో వీళ్ళిద్దరూ ఇలా చాలా క్లోజ్ గా మాట్లాడుతూ కనిపించడంతో వీరిపై మళ్ళీ గాసిప్స్ మొదలయ్యాయి. ఇక ఇందులో మీనాక్షి చౌదరి తన ముఖానికి మాస్క్ వేసుకొని.. హ్యాండ్ బ్యాగ్ తో కనిపించింది. అటు సుశాంత్ బ్లాక్ లగేజ్ ట్రాలీ తో పాటు మరో బ్యాగ్ చేతిలో పట్టుకొని క్యాజువల్ లుక్ లో నడుస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది
గతంలో కూడా ఎఫైర్ రూమర్స్..
సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది అని వార్తలు వైరల్ అయ్యాయి. కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఈ జంట ఏదైనా స్పందిస్తుందేమో అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే సుశాంత్ దీనిపై స్పందించలేదు. కానీ మీనాక్షి నుంచి సమాధానం వచ్చింది. ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ..” నేను సింగల్ గా ఉన్నాను త్వరలోనే పెళ్లి చేసుకునే ఆలోచన అయితే అసలుకే లేదు. ప్రతి నెలలో కూడా నాకు ఒక కొత్త రిలేషన్షిప్ లేదా కొత్త సినిమా గురించి రూమర్స్ పుట్టించడం ఇప్పుడు సాధారణమైపోయింది” అంటూ ఆమె కామెంట్ చేసింది.
ALSO READ:Comedian Sathyan: వేలకోట్లు.. అత్యాశతో ఆస్తి కర్పూరంలా కరిగించారు.. కట్ చేస్తే!
మీనాక్షి కెరియర్..
మీనాక్షి చౌదరి వెబ్ సిరీస్ ద్వారా ఇండస్ట్రీకి అడుగు పెట్టినా.. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ‘గుంటూరు కారం’ తో పాటు ‘ లక్కీ భాస్కర్’ సినిమాలు చేసి సక్సెస్ అందుకున్న మీనాక్షి.. ఈ ఏడాది మొదట్లో అనిల్ రావిపూడి (Anil ravipudi)దర్శకత్వంలో ‘ సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చేసి మరో విజయాన్ని అందుకుంది. గత కొద్ది రోజులుగా వెకేషన్స్ కి వెళ్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈమె ఇప్పుడు మరొకసారి సుశాంత్ తో ఎయిర్పోర్ట్లో కనిపించి మళ్లీ వార్తల్లో నిలిచింది అని చెప్పవచ్చు. మరి దీనిపై మీనాక్షి ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.