ఆలయాల్లో దొంగతనాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. కొంత మంది హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్తే, మరికొంత మంది గుడిలోని బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్తుంటారు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తుంటారు దొంగలు. తాజాగా అనంతపురంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఆలయం హుండీ పగలగొట్టి డబ్బులు దోచుకెళ్లారు కొంత మంది దొంగలు. ఏం జరిగిదో తెలియదు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓ షాకింగ్ ఘటన జరిగింది. తాజాగా ఆలయం ఓపెన్ చేసే సరికి పోయిన డబ్బులన్నీ మళ్లీ కనిపించాయి. ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. నెల రోజుల క్రితం దొంగిలించబడిన డబ్బులు మళ్లీ ఎలా వెనక్కి వచ్చాయి? అని ఆశ్చర్యపోయారు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం గ్రామ పంచాయితీ పరిధిలో ముసలమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయంలో వెలిసిన అమ్మవారికి ఎన్నో శక్తులు ఉన్నాయని పరిసర ప్రాంతాల ప్రజలు నమ్ముతారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఆలయంలో నెల రోజుల క్రితం దొంగలు పడ్డారు. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అమ్మవారి హుండీని పగలగొట్టి అందులోని సొమ్ము అంతా దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అందరూ షాకయ్యే ఘటన జరిగింది. నెల రోజుల క్రితం దోచుకెళ్లిన డబ్బులు మళ్లీ ఆలయం ఆవరణలో ప్రత్యక్షం అయ్యాయి. డబ్బులతో పాటు ఓ లెటర్ కూడా దొరికింది.
అమ్మవారి హుండీ దొంగతనం చేసిన దొంగలు పశ్చాత్తాపం చెంది ఆ లేఖ రాశారు. తమను క్షమించాలని అమ్మవారిని వేడుకున్నారు. “మేం నలుగురు కలిసి ఆలయంలో హుండీ పగలగొట్టి దొంగతనం చేశాం. ఇంటికి వెళ్లినప్పటి నుంచి అసలు సమస్యలు మొదలయ్యాయి. మా పిల్లల ఆరోగ్యం బాగాలేదు. నా కొడుకు పరిస్థితి సీరియస్ గా ఉంది. హాస్పిటల్ ఖర్చు కోసం దొంగతనం చేసిన డబ్బులో కొద్దిగా వాడుకున్నా. అమ్మవారిని క్షమించాలని వేడుకుంటున్నాం” అని లేఖ రాసి ఆ డబ్బులో ఉంచి వెళ్లారు.
అమ్మవారి హుండీ దొంగతనం… ఆపై పశ్చాత్తాపంతో లెటర్ రాసి హుండీలో వేసి…..నన్ను క్షమించాలని లేఖ బుక్కరాయసముద్రం పంచాయతీలో నెలరోజుల క్రితం ముసలమ్మ దేవాలయంలో హుండీ చోరికి గురైన హుండీ నగదును దుండగులు నిన్న రాత్రి ఆలయ ఆవరణలో పడేసి వెళ్లిపోయారు. పోలీసులకు సమక్షంలో ధర్మకర్త సుశీలమ్మ,… pic.twitter.com/z1gHtUueTb
— BIG TV Cinema (@BigtvCinema) September 5, 2025
Read Also: ఓరి నీ దుంపతెగా.. పాముకే నాగిని డ్యాన్స్ నేర్పిస్తున్నావు కదరా!
దొంగతనం జరిగిన డబ్బులు మళ్లీ ఆలయ ప్రాంగణంలో ఉంచడంతో కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు సమక్షంలో ధర్మకర్త సుశీలమ్మ, సింగిల్ గా విండో చైర్మన్ కేశన్న, మాజీ సర్పంచ్ నారాయణస్వామి ఆధ్వర్యంలో నగదును సంచిలో నుంచి బయటకు తీసి లెక్కింపు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మవారు తమ శక్తి డబ్బులు తిరిగి తెప్పించుకున్నారని భక్తులు చెప్తున్నారు.
Read Also: చేతికి వంద.. ప్లేట్ నిండా భోజనం.. అన్నదానం ఇలా కూడా చేస్తారా బ్రో?