‘శుభలగ్నం’ సినిమాను ఒకసారి గుర్తుకు చేసుకోండి. ఆమనికి డబ్బులు ఇచ్చి మరి ఆమె భర్త ఆయన జగపతిబాబును పెళ్లి చేసుకుంటుంది రోజా. అలాంటి కథే నిజ జీవితంలో కూడా జరిగింది. కాకపోతే ఇది మన దేశంలో కాదు చైనాలో. చైనాలో కూడా సంప్రదాయాలు, కట్టుబాట్లు మనలాగే ఉంటాయి. అందుకే అక్కడ కూడా ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
చైనాలోని హాన్ అనే వ్యక్తికి 2013లో పెళ్లయింది. అతని భార్య పేరు యాంగ్. మీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే పెళ్లయ్యాక తన వ్యాపార భాగస్వామి అయినా హోన్షి తో ఎఫైర్ పెట్టుకున్నాడు హాన్. వీళ్ళిద్దరికీ కలిపి ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే ప్రియురాలు తన ప్రియుడ్ని భర్తగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొదటి భార్య దగ్గరకు వెళ్లి విడాకులకు ఒప్పించింది. ఇందుకోసం ఆమె 1.2 మిలియన్ యువాన్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.1.39 కోట్లు. ఈ డబ్బులు తీసుకొని భర్తకు విడాకులు ఇచ్చి తన ఇద్దరు పిల్లలతో జీవించేందుకు మొదటి భార్య ఒప్పుకుంది.
తనను ఇంతగా మోసం చేసిన భర్తను, ప్రియురాలిని మూడు చెరువుల నీళ్లు తాగించాలని డిసైడ్ అయింది మొదటి భార్య. అందుకోసం ముందుగా డబ్బును తీసేసుకుంది. కానీ భర్తకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ప్రియురాలు కోర్టుకు మెట్లు ఎక్కింది. మాట ఇచ్చిన ప్రకారం డబ్బులు తీసుకున్నాక భర్తకు విడాకులు ఇవ్వలేదు. కాబట్టి తన డబ్బును తిరిగి ఇచ్చేయాలని ప్రియురాలు మొదటి భార్యను కోరింది. ఆ రెండింటికీ కూడా మొదటి భార్య ఒప్పుకోలేదు.
షాక్ ఇచ్చిన కోర్టు
ప్రియురాలికి గట్టి షాకే ఇచ్చింది కోర్టు కూడా. చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే విధంగా విడాకులను తీసుకోనంతకాలం వారిద్దరూ భార్యాభర్తలే అవుతారని కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు నైతిక ప్రమాణాలకు విరుద్ధంగా ఇలా డబ్బులు ఇచ్చి భార్యాభర్తలకు విడాకులు తీసుకోమని చెప్పడం మంచి పద్ధతి కాదని, అది కోర్టు ఉల్లంఘన కూడా అవుతుందని పేర్కొంది. చట్టం ప్రకారం డబ్బు వాపసు ఇచ్చే అవకాశం లేదని కోర్టు చెప్పింది. ఆ డబ్బు తీసుకొని విడాకులు ఇస్తానని మొదటి భార్య ఎక్కడా రాతపూర్వకంగా చెప్పలేదని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెను ఏమీ అనలేమని కోర్టు తెలియజేసింది. దీంతో ప్రియురాలికి గట్టి షాకే కొట్టింది.
Also Read: బిచ్చగాళ్లకు దానం చేస్తున్నారా? జాగ్రత్త, భారీ ఫైన్ తప్పదు.. జనవరి నుంచే అమలు!
చివరికి మొదటి భార్య తన భర్త, సవతిపెట్టే పోరును భరించలేక చట్టబద్ధంగా విడిపోవడానికి ముందుకు వచ్చింది. అయితే ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు నిజ జీవితంలో గుణపాఠాన్ని నేర్పుతాయి. భార్యకు తెలియకుండా ప్రియురాలిని మెయింటైన్ చేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు పరిస్థితులు తిరగబడతాయో చెప్పడం చాలా కష్టం. కాబట్టి హిందూ పద్ధతులను అనుసరించి ఎలాంటి అనైతిక చర్యలకు, అఫైర్లకు చోటు ఇవ్వకుండా ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నించాలి. ఈ విషయం తెలిసినవారు.. పగలబడి నవ్వుతున్నారు. మంచి గుణపాఠం చెప్పిందని అంటున్నారు. ఆమె ఇచ్చిన ట్విస్టుతో ‘శుభలగ్నం 2’ తియొచ్చేమో అని కామెంట్లు చేస్తున్నారు.