BigTV English

Click Here: సోషల్ మీడియాలో క్లిక్ హియర్ ట్రెండ్… అసలేంటి గురూ ఇది?

Click Here: సోషల్ మీడియాలో క్లిక్ హియర్ ట్రెండ్… అసలేంటి గురూ ఇది?
Click Here
Click Here

Click Here: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అది సెలబ్రిటీలకు సంబంధించిందే కానీ, రాజకీయ నేతలకు సంబంధించిందే కానీ.. కాస్త వెరైటీగా ఉందంటే ట్రెండ్ చేస్తూనే ఉంటారు. ఈ తరుణంలో తాజాగా ఎక్స్‌లో ఓ పోస్ట్ తెగ ట్రెండ్ అవుతోంది. ఏకంగా సెలబ్రిటీలు, ప్రముఖ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, విద్యార్థులు, నెటిజన్లతో సహా ట్విట్టర్ లో ఏ పోస్ట్ చేసినా ఇదే కనిపిస్తుంది. క్లిక్ హియర్ అనే పేరుతో ఉన్న పోస్ట్ ను ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.


లక్షల మంది సోషల్ మీడియా యూజర్లు ప్రస్తుతం క్లిక్ హియర్ అనే పోస్టును వైరల్ చేస్తున్నారు. ఎవరి అకౌంట్ చూసినా క్లిక్ హియర్ అని మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇలా కనిపించడంతో చాలా మంది అసలు ఏంటిది అని ఆశ్చర్యపోతున్నారు. తెలియనివారు చూసి ఇదేంటో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ఫోటోలో క్లిక్ హియర్ అని ఇంగ్లీష్ లో రాసి ఉంది. దీనికి ముందు బాణం గుర్తుతో చూపిస్తూ.. ఆల్ట్ ను క్లిక్ చేయాలని సూచిస్తుంది. ఆల్ట్ ను క్లిక్ చేయడం ద్వారా ఆ పోస్ట్ అసలు సందేశం ఏంటనేది తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్ట్ చూడాలంటే ఫోటోను క్లిక్ చేస్తే చూడలేము.. ఆల్ట్ అని ఉన్న దానిపై క్లిక్ చేయడం వల్ల సందేశాన్ని చదవగలుగుతాం.

Also Read: ఇదేందయ్యా.. సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు పంపావు.. పైగా సారి ఒకటి


క్లిక్ హియర్ అనే పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పొలిటికల్ పార్టీల నేతలు, సెలబ్రిటీలు కూడా తమ సందేశాన్ని ఈ పోస్ట్ రూపంలో పంచుకుంటున్నారు. ఈ తరుణంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ ఉద్దేశ్యాన్ని తెలియజేసేందుకు పొలిటికల్ పార్టీలకు ఇది ఒక అస్త్రంగా మారింది. ఈ పోస్ట్ ద్వారా రానున్న ఎన్నికల్లో తమ పార్టీయే గెలుస్తుందని సందేశాన్నిస్తున్నారు.

అసలు క్లిక్ హియర్ ఉద్దేశ్యం ఏంటి..

ఎక్స్ అక్సెసిబులిటీ ఫీచర్ అయిన ఆల్ట్ టెక్ట్స్ బటన్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఇది యూజర్ తెలపాలని అనుకున్న సందేశాన్ని ఇమేజ్ రూపంలో చూపిస్తుంది. దీనిని ప్లాట్ ఫాంపై ఉన్న యూజర్లకు సందేశాలను అర్థం అయ్యేలా తెలిపేందుకే ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Related News

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Viral News: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!

Viral Video: కారుపై ముద్దులాట.. కౌగిలింతలతో బరితెగింపు.. ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Credit Cards: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!

Big Stories

×