ఆఫ్రికాలోని దేశాల్లో ఎన్నో విచిత్రమైన అలవాట్లు, ఆచారాలు ఉంటాయి. ఆఫ్రికా దేశమైనా నైజీరియాలో యేరుబా అనే ప్రాంతం ఉంది. అక్కడ కూడా ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. అది చూస్తే ఎంతో వింతగా.. ఏం జరుగుతుందో అర్థం కానట్టు అనిపిస్తుంది. ఆ వింత ఆచారం గురించే ఇప్పుడు ఇక్కడ ఇచ్చాము.
ఆ వీడియో వైరల్
ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వైరల్ అవుతున్న వీడియో నైజీరియాలోని యేరుబా ప్రాంతానికి చెందింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి తమ సాంప్రదాయాల ప్రకారం చేసిన ఒక పని ప్రపంచానికి విచిత్రంగా అనిపించింది. అందుకే అది వైరల్ అయింది. యేరుబా సంస్కృతి ప్రకారం పెద్ద గిన్నెను తీసుకుంటారు. ఆ పెద్ద గిన్నె పేరు కాలాభాష్. ఈ గిన్నెను ఒక మొక్క నుండి తయారు చేస్తారని చెప్పుకుంటారు. పశ్చిమ ఆఫ్రికాలోనే దీన్ని అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు.
పాములు గుడ్లు పెట్టి
ఈ గిన్నె లోపల ఒక పెద్ద పాముని ఒక వ్యక్తి పెట్టాడు. తర్వాత గుడ్లు, అరటి పండ్,లు ఆకుపచ్చని ఆకులు వేసి ఉంచాడు. ఇది చూసిన తర్వాత ఎంతోమంది దాన్ని అలా వండేస్తారేమో అని భయపడ్డారు. నిజానికి ఆ పాత్రను ఏమీ చేయరు. తమ సంస్కృతిలో సాంప్రదాయం ప్రకారం ఆ గిన్నెలో అలా పాములను, గుడ్లను, అరటి పండ్లను పెడతారు. ఇది ఒక ఆచారంగా ఎన్నో నుంచి వారికి వస్తోంది.
ఇలా చేస్తే ఏమవుతుంది?
ఒక తెగలో ఉండే ఆచారాలు, సంస్కృతులు గురించి పూర్తిగా వివరించడం కష్టం. ఎందుకంటే అవి కేవలం నమ్మకం పైనే ఆధారపడి ఉంటాయి. సంస్కృతిలో కూడా ఈ గిన్నెలో పాములు, పండ్లు, ఆకులను పెట్టే ఆచారం ఉంది. ఇలా చేయడం వల్ల వారికి మంచి జరుగుతుందని నమ్ముతారు. ఎందుకంటే పాములు ప్రత్యేకమైన శక్తులు కలిగి ఉన్నవని యేరుబా ప్రజల విశ్వాసం. అలాగే వైద్య లక్షణాలు కూడా దానిలో ఉన్నాయని భావిస్తారు. ఇక అరటి పండ్లు, గుడ్లు కూడా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. అందుకే వాటి వల్ల కూడా మేలు జరుగుతుందని వారి నమ్మకం. ఆహారం, ఔషధ లక్షణాలు కలిపి ఇలా కలిపిన పదార్థాలను ఒక పెద్ద గిన్నెలో పెట్టడం అనేది ఎన్నో వందల ఏళ్ల క్రితం నుంచి యేరుబా సంప్రదాయంలో వస్తోంది.
వాటిని తినేస్తారా?
ఈ వీడియో చూసిన ఎంతోమంది దానిని విందు కోసం తయారు చేస్తున్నారేమో అనుకుంటారు. సాధారణంగా ఇది భోజనం కాదు. కేవలం ఒక సాంప్రదాయం, ఆచారం అని చెప్పుకోవాలి. ఈ ఆచారం చేసిన తర్వాత పామును బయటికి వదిలేస్తారు. గుడ్లు, అరటి పండ్లు, ఆకులు వంటివి బయట పారేస్తారు.. తప్ప వాటిని తినేందుకు ఇష్టపడరు. లేదా మట్టి తవ్వి అందులో పాతి పెట్టడం వంటివి చేస్తారు.
ఈ ఆచారంలో పాము ముఖ్యమైనది. కాబట్టి దానికి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటారు. దాని అడవిలోకి వదిలేస్తారు. ఒకవేళ పాము మరణిస్తే దాని అవశేషాలను గౌరవప్రదంగా ఖననం చేస్తారు. దానికి కూడా సాంప్రదాయమైన పద్ధతులను పాటిస్తారు. ఇక పెద్ద గిన్నె అయినా కాలాబాష్ ను శుభ్రం చేసి తిరిగి భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటారు. లేదా కొంతమంది దాన్ని కూడా భూమిలో పాతి పెట్టడం వంటివి చేస్తారు.
మిగతా దేశాల ప్రజలతో పోలిస్తే ఆఫ్రికా ఖండంలోని ప్రజలకు ఎన్నో ఆచారాలు, నమ్మకాలు ఎక్కువ. వారి సంస్కృతులు, సొంత ప్రత్యేక మార్గాలను కలిగి ఉంటాయి. వారు ఎక్కువగా తమ గతంతో అంటే పూర్వీకులతో కనెక్ట్ అయ్యే విధంగా.. వారి నమ్మకాలను, ఆచారాలను సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే ఇలా గిన్నెలో పాములు పెట్టడం వంటి ఆచారాలను పాటిస్తూ ఉంటారు.