BigTV English

Jasprit Bumrah: వద్దురా నాయనా… బుమ్రా ఆడకపోతేనే టీమిండియా గెలుస్తుందా…? ఇదిగో ఈ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Jasprit Bumrah: వద్దురా నాయనా… బుమ్రా ఆడకపోతేనే టీమిండియా గెలుస్తుందా…? ఇదిగో ఈ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Jasprit Bumrah: 5 టెస్ట్ లు ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన భారత జట్టు తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలయింది. ఇక బర్మింగ్ హమ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ లో ఘన విజయం సాధించింది.


Also Read: Trolls On Gambhir: మ్యాచ్ లు గెలవాలంటే మంచి బౌలర్స్ ఉండాలి అంకుల్.. గంభీర్ పై దారుణంగా ట్రోలింగ్

గిల్ నాయకత్వంలోని భారత జట్టు టెస్ట్ క్రికెట్ లో తొలిసారిగా వెయ్యి పరుగుల మార్క్ ను దాటింది. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి మొత్తం 1,014 పరుగులు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం గమనార్హం. 2004లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగుల గత రికార్డు స్కోర్ ని అధిగమించింది.


వన్డే, టి-20 ల్లో భారత్ కి తిరుగులేదు:

నిజానికి వన్డేలలో టీమిండియా కి తిరుగులేదని చెప్పవచ్చు. అలాగే టి-20 లలో కూడా ఇండియాను పోల్చి చూడాల్సిన అవసరం లేదు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి భారత జట్టు దారుణంగా తేలిపోతుంది. బ్యాటర్లు భారీగా పరుగులు రాబడుతున్నప్పటికీ.. బౌలర్లు మాత్రం వికెట్లు తీయడంలో దారుణంగా విఫలమవుతున్నారు. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో భారత బౌలర్లు దారుణంగా చేతులెత్తేశారు. గెలవాల్సిన మ్యాచ్ ని ఇంగ్లాండ్ చేతుల్లో పెట్టి పరువు తీసుకున్నారు.

జట్టులో గొప్ప గొప్ప బౌలర్లు ఉన్నప్పటికీ.. వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. లీడ్స్ లో తొలి టెస్ట్ ఆడిన భారత ప్రధాన బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాకి.. రెండవ టెస్ట్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఆకాష్ దీప్ జట్టులోకి వచ్చాడు. అతడు రెండవ టెస్టులో అద్భుతంగా రాణించాడు. అయితే ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరగబోయే మూడవ టెస్ట్ కి ఆకాష్ దీప్ నీ పక్కన పెట్టి.. తిరిగి బుమ్రాని జట్టులోకి తీసుకోబోతున్నారు.

బుమ్రా జట్టులో ఉంటే ఓటమేనా..?

ఈ క్రమంలో బుమ్రా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అతడిని జట్టులోకి తీసుకోకపోవడం మంచిదని కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది నెటిజెన్లు. దీనికి కారణం ఏంటంటే.. బుమ్రా జట్టులో లేకుంటేనే భారత జట్టు గెలుపొందుతుందని.. అతడు జట్టులో ఉన్న ప్రతి టెస్ట్ మ్యాచ్ ఓడిపోతుందని లెక్కలతో సైతం చూపిస్తున్నారు. గత టెస్ట్ మ్యాచ్ ల విషయానికి వస్తే బుమ్రా జట్టులో లేని గత తొమ్మిది మ్యాచ్లను భారత జట్టు గెలుపొందింది. కానీ అతడు జట్టులో ఉన్న 8 మ్యాచ్లలో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలుపొందింది.

Also Read: Indian Cricketers: కూరగాయలు, ఛాయ్, వడాపావ్ అమ్ముకుంటున్న టీమిండియా క్రికెటర్లు.. ఈ వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే!

ఈ 8 మ్యాచ్లలో ఆరు మ్యాచ్లలో ఓటమి, కేవలం ఒక మ్యాచ్ లోనే గెలుపొంది.. మరో మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఈ క్రమంలోనే బుమ్రా జట్టులో లేకుంటేనే భారత జట్టు గెలుపొందుతుందని.. అతడుని జట్టులోకి తీసుకోకపోవడం మేలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక గత తొమ్మిది టెస్ట్ మ్యాచ్లలో కేవలం ఒక మ్యాచ్ లోనే విజయం సాధించి భారత జట్టు జింబాబ్వే సరసన నిలిచింది. గతేడాది కివీస్ తో జరిగిన మూడు టెస్ట్ లలో భారత్ నాసిరకమైన ప్రదర్శన చేసి.. ఏకంగా మూడు టెస్ట్ లలో ఓటమిపాలై పరువు తీసుకుంది. తొలిసారిగా కివీస్ చేతిలో వైట్ వాష్ కి గురయింది. దీనిద్వారా డబ్ల్యుటిసి ఫైనల్స్ కి వెళ్లే అవకాశాలను చేజార్చుకుంది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×