BigTV English

Cow Chases Tiger : పులిని పరిగెత్తించిన ఆవు.. వైరల్ అవుతున్న వీడియో!

Cow Chases Tiger : పులిని పరిగెత్తించిన ఆవు.. వైరల్ అవుతున్న వీడియో!

Cow Chases Tiger


Cow Chases Tiger Video : ఆవు.. సాధు జీవుల్లో ఇది కూడా ఒకటి. ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ ఆవులు ఉండేవి. ఆవులు గడ్డి, చిన్న చిన్న మొక్కల ఆకులు తిని జీవిస్తుంటాయి. దీన్ని కామధేనువు అని కూడా పిలుస్తారు. అందుకే హిందువుల పండుగలు, గృహప్రవేశాలప్పుడు ప్రత్యేకంగా పూజిస్తారు. కొందరైతే ఆవులను ప్రత్యేకంగా పెంచుకుంటారు.

ఇలాంటి సాధు జీవి అయిన ఆవుకు కోపం వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఎప్పుడైనా ఆవుకు కోపం రావడం చూశారా? ఆవు పులిని తరిమిన ఘటన ఎప్పుడైనా తిలకించారా? అయితే ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూడండి.


ప్రస్తుత కాలంలో అడవులు బాగా తగ్గిపోయాయి. దీని కారణంగా కాలుష్యం పెరిగిపోయింది. ఈ క్రమంలో అడవులపై ఆధారపడి జీవిస్తున్న జంతువులు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నాయి. వీటిలో కొన్ని జంతు జాతులు చనిపోతుండగా.. మరికొన్ని మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఇలాంటి వాటిలో ముందు వరుసలో ఉండేవి కోతులు.

Read More : ఛత్రపతి శివాజీ పెంపుడు కుక్క గొప్పతనం తెలుసా..?

అడవులు అంతరించి పోవడం వల్ల కోతులు ఇటీవల కాలంలో ఇళ్లల్లోకి ప్రవేశించి మనుషులపై దాడులు చేస్తున్నాయి. అక్కడక్కడ పులులు కూడా ఇళ్లలోకి ప్రవేశించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల శ్రీశైలం అటవీ ప్రాంతంలో పులి హైపేపై నిద్రించింది. అలానే మరొసారైతే శ్రీశైలం గుడిలోకి కూడా ప్రవేశించింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.

అయితే తాజాగా ఒక పులి జనావాసాల్లోకి వచ్చింది. ఆ ప్రాంతంలో మేత తింటున్న ఆవులను, దూడలను వెంబడించింది. ఒంటరిగా ఉన్న ఒక దూడను తినేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఫారెస్ట్ అధికారి సుశంత నంద తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

గ్రామంలోని ఖాలీ స్థలంలో ఒక రైతుకు చెందిన పశువులపాక ఉంది. ఆ పాకలో ఆవులు, దూడలు ఉన్నాయి. ఆ రైతు మేత కోసం వాటిని వదిలిపెట్టాడు. అదే సమయంలో అక్కడ మాటువేసిన ఓ పులి ఆవులను వెంబడించింది. ఆవులు దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఒక దూడ అక్కడే ఉండిపోయింది.

ఆ దూడను గమనించిన పులి దానిని చంపేందుకు వెంటబడింది. కానీ వెంటనే తన దూడపై జరుగుతున్న దాడిని ఆవు గుర్తించింది. దూడ అరుపులు విని చలించిపోయింది. ఎదుట ఉన్నది పులి అయినప్పటికీ భయపడకుండా ధైర్యంగా ఎదురుదాడికి దిగింది. దీంతో చేసేదేమి లేక పులి అక్కడి నుంచి పారిపోయింది.

Read More : తమన్నాను మించిపోయిన ఏనుగు డ్యాన్స్.. కావాలయ్య సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు

ఈ వీడియోలో ఆవు అక్కడ ఉన్న ప్రతి ఆవును తరిమి కొట్టింది. అన్ని ఆవులను పరిగెత్తించిన పులికి ఒక్క ఆవు ఎదురు తిరగడంతో పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇక అటవీ శాఖ అధికారి సుశాంత నంద ఈ వీడియోను షేర్ చేస్తూ ..దేశంలో ఆపరేషన్ టైగర్ పేరిట కేంద్ర ప్రభుత్వం పులుల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించింది. అందుకే దేశంలో పులుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం వీటి సంఖ్య మూడువేలకు చేరింది.. దానికి ఉదాహరణే ఈ పులి జనావాసాల్లోకి రావడం అంటూ రాసుకొచ్చారు.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×