BigTV English

Bull on Police Station Roof: పోలీస్ చౌక్ పైకప్పుపైకి ఎక్కిన ఎద్దు.. నెట్టింట వీడియో వైరల్!

Bull on Police Station Roof: పోలీస్ చౌక్ పైకప్పుపైకి ఎక్కిన ఎద్దు.. నెట్టింట వీడియో వైరల్!

Bull Climbing Police Station Roof: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఎవరు ఊహించని రీతిలో పలు వీడియోలు దర్శనమిస్తుంటాయి. చాలా వరకు డ్యాన్స్ వీడియోలు, ప్రోగ్రాం వీడియోలు, సినిమాలకు సంబంధించిన వీడియోలు ఉంటున్నా కూడా సాధారణంగా బయట జరిగే కొన్ని ఘటనలు ఎక్కువగా నెట్టింట వైరల్ అవుతుంటాయి. నిజ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు చూసిన వారు ఆశ్చర్యపోతుంటారు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. అయితే తాజాగా ఓ ఆవుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవు ఏకంగా బంగ్లా పైకి ఎక్కేసింది.


వైరల్ అవుతున్న వీడియో పోలీస్ పోస్ట్ పైకప్పుది. వీడియోలో ఓ ఆవు ఏకంగా పోలీస్ పోస్ట్ పై కప్పుపైకి ఎక్కేసింది. మొదట్లో ఆవును కిందకు దించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ఏ ప్రయత్నం సఫలం కాలేదు. ఎద్దు పైకి ఎక్కి తిరుగుతూ ఉందని, దానికి తిరిగి కిందకు ఎలా దిగాలో తెలియడం లేదు. అందువల్ల ఆ ఎద్దు అక్కడే ఉండిపోయింది. దీంతో స్థానికులు, పోలీసులు కలిసి ఎద్దును కిందకు దించే ప్రయత్నం చేశారు. అసలు అది పైకి ఎలా ఎక్కింది అని చూసినా కూడా ఎవరికి అంతుచిక్కలేదు.

ఈ ఘటన యూపీలోని రాయ్ బరేలీలో వెలుగుచూసింది. రాయ్‌బరేలీలోని సలోన్‌లో ఉన్న పోలీస్ పోస్ట్ పైకప్పుపై ఎద్దు ఎక్కిందని సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు అసలు ఎద్దు అక్కడికి ఎలా ఎక్కింది అని ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ వీడియోకు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: Viral Video: దేవుడా.. అతి పెద్ద టైరును అమర్చి.. పల్సర్ బండిని నడిపాడు..

Related News

Indonesian Elderly Couple: గూగుల్ స్ట్రీట్ వ్యూలో వృద్థ జంట.. పదేళ్ల జీవితం కళ్ల ముందు.. గుండె బరువెక్కడం ఖాయం!

Viral Video: పిల్లలా? నా వల్ల కాదు.. ఆడ సింహన్ని చూసి మృగరాజు పరుగోపరుగు!

Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Big Stories

×