BigTV English

Bharateeyudu OTT: ఓటీటీలోకి భారతీయుడు ఎంట్రీ.. షాక్‌లో ఆడియెన్స్..!

Bharateeyudu OTT: ఓటీటీలోకి భారతీయుడు ఎంట్రీ.. షాక్‌లో ఆడియెన్స్..!

Kamal Haasan’s Bharateeyudu Movie Set to Stream on Netflix from July 15th: 1996 ఏడాదిలో లోకనాయకుడు కమల్‌హాసన్‌, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన మూవీ భారతీయుడు. ఈ మూవీ అప్పట్లో ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ సూర్య మూవీ బ్యానర్‌పై ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీలో నటి మనీషా కోయిరాల హీరోయిన్‌గా నటించగా, ఊర్మిల మతోంద్కర్, సుకన్య ఇతర నటీనటులు ప్రధాన పాత్రలో యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ 20 ఏళ్ల క్రితమే రూ.15 కోట్ల రూపాయలతో నిర్మించగా..ఈ మూవీ ఏకంగా రూ. 50 కోట్లకు పైగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టింది.ఇప్పుడు సుమారు 28 ఏళ్ల తరువాత భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ వచ్చింది. ఇందులో కమల్‌హాసన్ మెయిన్ రోల్ పోశించగా ఈ మూవీ తెలుగులో భారతీయుడు 2 పేరుతో జూలై 12న రిలీజ్ అయింది.


ఈ నేపథ్యంలో భారతీయుడు మూవీ ఫస్ట్ పార్ట్ కోసం చాలామంది ఓటీటీలో సెర్చ్‌ చేసే పనిలో పడ్డారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తీపికబురు చెప్పింది. ఈ కల్ట్‌ మూవీకి భారీగా ఫ్యాన్స్ ఉండటంతో ఈనెల 15న మరోసారి భారతీయుడు మూవీని ఓటీటీలో రిలీజ్ చేసి ఆడియెన్స్ నుండి మంచి మార్కులు కొట్టేసి కలెక్షన్లతో రికార్డులు బ్రేక్ చేద్ధామని చూస్తున్నారు. అంతేకాదు ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తే ఆడియెన్స్ నుండి మంచి స్పందన వస్తుందని అటు మూవీ యూనిట్, ఇటు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన జానూ, వైరల్ వీడియో


ఇక భారతీయుడు 2 కంప్లీట్‌గా మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది.ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్‌లో ఉందని, కానీ సెకండ్ పార్ట్‌ దాని దరిదాపుల్లోకి కూడా రాలేదని మూవీ అభిమానులు,నెటిజన్లు తమ ఓపీనియన్‌ని తెలుపుతున్నారు. భారతీయుడు 2 మూవీలో హీరో కమల్‌హాసన్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, నటుడు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంకర్ వంటి నటీనటులు ఇందులో నటించారు. ఇక ఈ మూవీకి అనిరుథ్‌ స్వరాలు అందించాడు.

ఇక 20 ఏళ్ళ కిందట వచ్చిన భారతీయుడు మూవీలో సేనాపతి రోల్‌లో అందరిని ఆకట్టుకున్న కమల్‌, మళ్లీ అదే పాత్రలో పార్ట్ 2లో కంటిన్యూ చేశాడు. అంతేకాదు కమల్ యాక్టింగ్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నా.. మూవీ స్టోరీ విషయంలో మాత్రం చాలా నిరుత్సాహంలో ఉన్నారు ఫ్యాన్స్. అంతేకాదు ఈ మూవీ కంప్లీట్‌గా నెగెటివ్ టాక్‌ని సంపాదించుకుంది.కేవలం ఈ రీజన్‌తోనే ఈ మూవీ 20 నిమిషాల యాక్షన్ సీన్‌ని కట్‌ చేసి కీలక నిర్ణయం తీసుకున్నారు మూవీ యూనిట్. ఇక ఈ మూవీ లెటెస్ట్ వెర్షన్ కూడా ఆదివారం నుండే ఆడియెన్స్‌కి అందుబాటులోకి రానున్నట్లు రానుందని మూవీ యూనిట్ తెలిపింది. చూడాలి మరి ఈ మూవీపై ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అవుతారో…

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×