BigTV English

Viral Video: నిన్న పాపడ్.. నేడు బాయిల్డ్ ఎగ్.. ఇదెక్కడి ఎండరా మావా..

Viral Video: నిన్న పాపడ్.. నేడు బాయిల్డ్ ఎగ్.. ఇదెక్కడి ఎండరా మావా..

Viral Video: ఈ ఏడాది వేసవికాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడ చూసినా 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మే నెలలో ఉత్తర భారతదేశంలో ఎండలు మరింత విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాజస్థాన్ సరిహద్దుల్లో వేడి గాలులు, మండుతున్న ఎండల కారణంగా అటు జవాన్లు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బికనీర్‌లోని సరిహద్దుకు సమీపంలోని ఓ ఎడారి ప్రాంతంలో ఓ జవాన్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.


ఇటీవల ఓ జవాన్ ఇసుక ఎడారిలో ఓ పాపడ్‌ను కాల్చిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే మరో జవాన్ కోడిగుడ్డు ఉడకబెట్టిన వీడియో వైరల్ అవుతోంది. బీఎస్ఎఫ్ జవాన్ రెండు నిమిషాల, 59 సెకన్లలో ఓ కోడిగుడ్డును ఇసుకలో పాతిపెట్టాడు. అనంతరం దానిని తీసి చూడగా అది ఉడికిపోయింది. దీంతో దాని పొట్టును తీస్తూ వీడియో చేశాడు.

రాజస్థాన్ ఎడారులలో తీవ్రమైన వేడి మధ్య సైనికులు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి అధికారులు అనుసరిస్తున్న జాగ్రత్తల వివరాలను వివరిస్తూ BSF సిబ్బంది, ‘ప్రస్తుత ఉష్ణోగ్రత 46 నుండి 47 డిగ్రీల సెల్సియస్, అయినప్పటికీ మా సైనికులు నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నారు. మేము హీట్‌స్ట్రోక్ నుండి రక్షించడానికి వారికి నిమ్మకాయ నీరు, ఇతర ద్రవాలను తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ప్రస్తుతం 48.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది.


Related News

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళల దుమ్మురేపే గొడవ.. వీడియో వైరల్!

Youtuber Arrest: యూట్యూబ్ లో వంటల వీడియోలు పోస్ట్ చేస్తున్నారా? ఐతే ఇది మీకోసమే

Viral dance video: ముక్కాల ముక్కాబుల పాటకు డ్యాన్స్ దుమ్ముదులిపేశారు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..!

Octopus video: అద్భుతమైన వీడియో.. తనను కాపాడినందుకు అక్టోపస్ ఎలా థ్యాంక్స్ చెప్పిందో చూడండి..!

Viral Video: రీల్ కోసం ఫ్లై ఓవర్ మీది నుంచి దూకిన యువకుడు.. కాళ్లు రెండూ…

Viral reels video: రీల్స్ పిచ్చి.. నడిరోడ్డుపై డాన్స్.. పోలీసులు కూడా షాక్!

Big Stories

×