Viral Video: జంతువులను కొంత మంది ఇష్టపడితే.. మరికొంత మంది వాటికి భయపడుతుంటారు. అందులో ముఖ్యంగా పెంపుడు జంతువులు ఎక్కువగా ఉంటాయి. అయితే పెంపుడు జంతువులే కాకుండా అడవుల్లో జీవించే వన్యప్రాణులను కూడా చాలా మంది జంతుప్రియులు ఇష్టపడుతుంటారు. వాటిని చూడాలని, కలిసి ఫోటోలు కూడా దిగాలనుకుంటారు. అయితే ఇదంతా పక్కన పెడితే జంతుప్రియులకు జంతువులపై ఉన్న ప్రేమ కారణంగా వాటికి ఏదైనా హాని కలిగే అస్సలు తట్టుకోలేరు. అందులో ముఖ్యంగా ఏనుగులు అంటే చాలా మంది ఇష్టపడతారు. వాటిపైకి ఎక్కడానికి, వాటితో కలిసి ఫోటోలు దిగడానికి చూస్తుంటారు. తాజాగా ఓ ఏనుగు భారీ ప్రమాదానికి గురైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఏకంగా ఓ ఏనుగును రైలు ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా- అగర్తల్ మధ్య వెలుగుచూసింది. ఏనుగు రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ రైలు ఢీకొట్టింది. దీంతో ఏనుగుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన ఏనుగు లేచి నడిచేందుకు ప్రయత్నించింది. నొప్పితో తల్లడిల్లుతూ ఏనుగు నడవాలని చూసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది కాంచనజంగా ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొనడంతో వెలుగుచూసింది.
ఏనుగు వెనుక భాగంలో గాయాలు బలంగా తగిలియాయి. నాలుగు కాళ్లకు గాయాలు కావడంతో ఏనుగు నడవలేని పరిస్థితికి చేరింది. ఏనుగుకు అటవీ శాఖ అధికారులు సహాయం చేయాలని, వెంటనే చికిత్స అందించి దాని ప్రాణాలు కాపాడాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
https://Twitter.com/SageEarth/status/1811089573717438931