Viral News: పాముని చూస్తే ఎలాంటి వారికైనా చెమటలు పడతాయి. చాలామంది దూరంగా పారిపోతారు. ఓ యువకుడు అన్ని పరిమితులు దాటాడు. మద్యం మత్తులో పాముని నమిలి మింగాడు. దాని ఫలితంగా ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. సంచలనం రేపిన ఘటన యూపీలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హర్దౌలి గ్రామానికి చెందినవాడు 35 ఏళ్ల అశోక్. కాకపోతే మద్యం పుచ్చుకోవడం అతడికి అలవాటు. ఆ క్రమంలో ఫుల్‌గా తాగేశాడు.. ఇంటికి వచ్చేశాడు. అశోక్ ఇంట్లో ఉన్న సమయంలో ఓ పాము వచ్చింది.
మత్తులో అశోక్ కళ్లు బైర్లు కమ్మాయి. దాన్ని పట్టుకుని కత్తితో ముక్కముక్కలుగా కోశాడు. ఆ తర్వాత వాటిని నమిలి మింగేశాడు. దృశ్యాన్ని చూసిన కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. వెంటనే ఇంట్లో వంట చేస్తున్న అతడు తల్లి సియా దులారి పరుగున వచ్చి తన కొడుకు నోటి నుండి పామును కష్టపడి బయటకు తీసింది.
అప్పటికే అతడు రెండు లేదా మూడు ముక్కలు మింగేశాడు. వెంటనే కుటుంబసభ్యులు సమీపంలోని బాబేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి వైద్యులు షాకయ్యారు. అక్కడ వైద్యుల బృందం అతడికి చికిత్స అందిస్తోంది. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పిందన్నారు.
ALSO READ: మేనమామ అంటే.. పాములు పలికి ఊరు తెలుసా, మనదేశంలో
పాము విషపూరితం అయితే పరిస్థితి తీవ్రంగా ఉండేదని అన్నారు. ప్రస్తుతం అశోక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతడికి యాంటీ వెనమ్ తోపాటు అవసరమైన మందులు అందిస్తున్నారు. అశోక్ పాముని తిన్న విషయం తెలిసి ఇరుగుపొరుగువారు ఆశ్చర్యపోయారు.
ఫుల్‌గా తాగేసి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకని అంటున్నారు. వర్షాకాలంలో ప్రతిరోజూ ఎవరో ఒకరిని పాములు కాటు వేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ పాముని నమిలినట్టు కొందరు చెబుతున్నారు. ఏదైనేం అశోక్ ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డాడు.
#बांदा : बबेरू कोतवाली क्षेत्र के हरदौली गांव में एक शराबी ने नशे की हालत में मरे हुए सांप को निगल लिया। परिजनों ने जब देखा तो आधा सांप उसके मुंह से बाहर निकाला, जबकि आधा वह पहले ही निगल चुका था। व्यक्ति को तुरंत सामुदायिक स्वास्थ्य केंद्र में भर्ती कराया गया, जहां उसका प्राथमिक… pic.twitter.com/6OBG3GyyvU
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) July 17, 2025