Kohli – Vanga Sandeep: ప్రపంచ క్రికెట్ లో పరిచయం అక్కర్లేని పేరు.. “విరాట్ కోహ్లీ”. క్రికెట్ లో ఈ రన్ మిషన్ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. క్రికెట్ దేవుడిగా కీర్తనలు అందుకున్న సచిన్ టెండూల్కర్ ని దాటేసి ఎవరికి సాధ్యం కానీ ఎన్నో అద్భుతాలు చేశాడు కోహ్లీ. వన్డే క్రికెట్ లో 50 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా రికార్డులకు ఎక్కాడు. జట్టు ఏదైనా, బౌలర్ ఎవరైనా సరే విరాట్ కోహ్లీ బ్యాట్ నుండి పరుగులు రావాల్సిందే.
Also Read: Virat Kohli Autograph: కోహ్లీ ఆటోగ్రాఫ్… రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిన 10 ఏళ్ల కుర్రాడు..?
సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీల తరువాత ఆ స్థాయి భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా నిర్వహించి పేరు గడించాడు. టెస్ట్, వన్డే, టి-20.. ఫార్మాట్ ఏదైనా విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి దిగాడు అంటే దబిడి దిబిడే. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లు అందరినీ చితక్కొడుతూ, రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతూ.. మళ్లీ ఇలాంటి క్రికెటర్ రాబోడు అంటూ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి విరాట్ కోహ్లీ జీవితం చాలామందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అతడు ఎంతగానో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు.
విరాట్ కోహ్లీ బయోపిక్:
అలాంటి విరాట్ కోహ్లీ బయోపిక్ తీయాలని చాలామంది దర్శకులు ప్లాన్ చేశారు. త్వరలోనే విరాట్ కోహ్లీ బయోపిక్ రూపొందనుందని ప్రచారాలు జరిగాయి. మొదట విరాట్ కోహ్లీ బయోపిక్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషిస్తాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కోలీవుడ్ నటుడు శంభు విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తాడని రూమర్ కూడా వచ్చింది. అయితే తాజాగా మరో ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది. విరాట్ కోహ్లీ బయోపిక్ ని లెజెండరీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోతున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది.
సౌత్ నుంచి వెళ్లి నార్త్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. ఇప్పటివరకు చేసింది కేవలం మూడు సినిమాలే. కానీ బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగా పేరు రీ సౌండ్ చేస్తుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేశాడు సందీప్ రెడ్డి. బోల్డ్ టేకింగ్ తో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. అయితే ఇప్పటివరకు సందీప్ చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. ఇకమీద చేయబోయే సినిమాలు మరో ఎత్తు అన్నట్లుగా ఉంది. సందీప్ త్వరలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ స్పిరిట్ మూవీ షూటింగ్ ని వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నాడట సందీప్. ప్రభాస్ తో స్పిరిట్ సినిమా పూర్తయిన వెంటనే.. విరాట్ కోహ్లీ బయోపిక్ ని తెరకెక్కించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.
కోహ్లీ బయోపిక్ లో రణ్ బీర్ కపూర్:
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. కోహ్లీ బయోపిక్ లో హీరోగా యానిమల్ హీరో రణబీర్ కపూర్ నటించబోతున్నట్లు ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ బయోపిక్ అంటే.. దానికి ఉండే క్రేజ్ వేరు. అయితే రణబీర్ కపూర్ కూడా తనకు కోహ్లీ పాత్రలో నటించాలని ఉందని గతంలో తన మనసులోని మాటను బయటపెట్టాడు. విరాట్ కోహ్లీ బయోపిక్ లో రణబీర్ కపూర్ సరిగ్గా సరిపోతాడని దినేష్ కార్తీక్ కూడా అభిప్రాయపడ్డాడు.