BigTV English

Mancherial District: ఒక్క ఇంజక్షన్ రూ. 16 కోట్లా? ఈ పిల్లలను ఆదుకొనే వారెవరు?

Mancherial District: ఒక్క ఇంజక్షన్ రూ. 16 కోట్లా? ఈ పిల్లలను ఆదుకొనే వారెవరు?

Mancherial District: ఆ తల్లి తన బిడ్డల కోసం పోరాటం చేస్తోంది. తన బిడ్డ తన కళ్లెదుట గంతులు వేస్తూ తిరుగుతుంటే ఆ తల్లి పడే ఆనందం వర్ణించలేనిది. కానీ ఈ తల్లి తన బిడ్డలు గంతులు వేయాలని అనుకున్నా, ఆ కోరిక తీరనిదిగా మారింది. తన బిడ్డల ఆరోగ్య స్థితి సాధారణ స్థితికి చేరేందుకు ఆ తల్లి చేస్తున్న పోరాటం అనిర్వచనీయం. ఇప్పటికే తమ ఆర్థిక స్థితికి మించి అప్పులు చేసి మరీ ఆ తల్లి, బిడ్డల కోసం తపన పడుతోంది. చివరికి నేడు సర్వం కోల్పోయి మానవాతావాదులూ.. ఆదుకోండి అంటూ జోలె పట్టింది. ఏకంగా తన ఇద్దరు బిడ్డలకు శాపంగా మారిన వ్యాధిని నయం చేసే శక్తి తమకివ్వాలని ఆ తల్లి కోరుకుంటోంది.


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన దేవిని కృష్ణవేణి, కల్యాణ్ దాస్ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె సహస్రకు ఏడాది వయస్సు కాగా, కుమారుడు మహా వీర్ కు 4 ఏళ్లు. ఈ ఇద్దరు చిన్నారులు.. బాల్యం నుండే వెన్నెముక కండరాల క్షీణత స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ-ఎస్ఎంఏ వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ వ్యాధితో వీరి వెన్నుపూస కండరాల బలహీనత, క్షీణతకు దారి తీస్తుంది. దీని ప్రభావంతో వీరిద్దరూ ఎక్కువ సేపు నిలబడలేరు.. నడవలేరు. ఇలాంటి అరుదైన వ్యాధికి గురైన చిన్నారులను చూసి, ఆ తల్లిదండ్రులు ప్రతి క్షణం పడే ఆవేదన అంతా ఇంతా కాదు.

తండ్రి కల్యాణ్ దాస్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్ ఆపరేటరుగా పనిచేస్తుండగా.. నర్సింగ్ పూర్తిచేసిన కృష్ణవేణి బెల్లంపల్లిలోనే ఉంటూ పిల్లల సంరక్షణను చూసుకుంటున్నారు. కళ్యాణ్ దాసుకు ప్రతి నెలా రూ.11 వేల వేతనం వస్తోంది. చాలీచాలని వేతనం అయినప్పటికీ, ఏ తండ్రైనా, ఏ తల్లి అయినా తమ బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసైనా వారిని కాపాడుకుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. తమ శక్తికి మించి రూ. 10 లక్షలు అప్పు చేసి మరీ, పిల్లలకు వైద్యం అందించారు. అయితే చిన్నారుల చికిత్స కోసం రూ.32 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తెలియని దీన స్థితిలో ఇప్పుడు ఈ చిన్నారుల తల్లిదండ్రులు ఏమి పాలుపోని స్థితిలో ఉన్నారు.


పిల్లలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉండాలన్నా ఒక్కొక్కరికి రూ.6.50 లక్షల విలువైన సిరప్ చొప్పున ఇద్దరికి రూ.13 లక్షల విలువైన సిరప్ లు వాడాలని వైద్యులు సూచించారు. కళ్లముందే ఆ చిన్నారులు.. అరుదైన వ్యాధికి గురై ఉండగా, ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన వర్ణించలేనిది. ఈ వ్యాధి పూర్తి నివారణ కోసం వైద్యులను సంప్రదిస్తే, ఒక్కొక్కరికి రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ చేయాలని వైద్యులు చెప్పారట. ఇద్దరికీ కలిపి అక్షరాల రూ. 32 కోట్లు అవసరం. అసలే అంతంత మాత్రమైన ఆర్థిక స్థితిలో గల ఈ కుటుంబానికి పెద్ద సమస్య అడ్డుగా ఉందని చెప్పవచ్చు.

Also Read: Love vs Honour: ప్రేమ VS పెద్దరికం.. చివరికి జీవితాలు అల్లకల్లోలం, అమృత ప్రణయ్ ఘటన.. కనువిప్పు అవుతుందా?

ఇప్పటికే ప్రతిరోజూ పిల్లలకు సిరప్ లు తాగించాల్సిన పరిస్థితి ఉందని, ఈ వ్యాధి నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించడానికి అవసరమయ్యే ఇంజక్షన్ల కోసం దాతలెవరైనా ముందుకు వచ్చి.. తమ పిల్లలను కాపాడాలని కృష్ణవేణి, కల్యాణ్ దాస్ వేడుకుంటున్నారు. రెండు ప్రాణాలు దాతల కోసం ఎదురుచూపుల్లో ఉన్నాయి. మరో రెండు ప్రాణాలు ఆ చిన్నారుల ప్రాణాలకు అడ్డుగా ఉన్నాయి. ఇప్పటికే తమ పిల్లల ప్రాణాలకు అడ్డుగా నిలిచి సర్వం కోల్పోయిన ఆ తల్లిదండ్రులు.. ఇప్పుడు ప్లీజ్ హెల్ప్ అంటూ అర్థిస్తున్నారు. చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఆ చిన్నారులను కాపాడేందుకు ఎవరో ఒకరు వస్తారని ఆ ఇంటి గడప ఎదురు చూస్తోంది. చేయి చేయి కలిపితే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. అందుకే సాయాన్ని ఆర్థిస్తున్న వారికి అండగా నిలిచే మానవతావాదులు స్పందించాలని కోరుకుందాం. అలాగే ప్రభుత్వం కూడా ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వీరికి సాయం అందించే వారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 8897494155

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×