Telangana: అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రతీ ఇంటికీ ఇంటర్ నెట్ సదుపాయం కామన్‌గా మారింది. బయట ఉంటే మొబైల్ నెట్, ఇంట్లో ఉంటే వైఫై. ఇంటర్నెట్ సేవలు ప్రస్తుతానికి సిటీలు, పట్టణాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కొన్ని ఇళ్లకు ఆ స్థాయిలో ఇంటర్నెట్ సౌకర్యం లేదు.
కొందరికి స్మార్ట్ టీవీలు ఉన్నా ఇంటర్నెట్ బిల్లులను భరించలేక దూరంగా ఉంటున్నారు. చాలామంది అస్సలు పట్టించు కోవడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టెక్నాలజీపై ఫోకస్ చేసింది. రాష్ట్రం డిజిటల్ విప్లవం దిశగా అడుగులు వేస్తోంది. టీ-ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌ను మరింత విస్తరిస్తున్నట్లు వెల్లడించారు ఐటీ మంత్రి.
బేగంపేటలో తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్ కొత్త కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని ప్రతి ఇంటికీ, ఆఫీసులకు ఇంటర్నెట్ సేవలు అందిస్తామని వెల్లడించారు. టీ ఫైబర్ ద్వారా ఆయా సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. చివరకు లోకల్ కేబుల్ ఆపరేటర్లకు ఇంటర్నెట్‌తో పాటు స్మార్ట్ సేవలను అందించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
టీ-ఫైబర్‌కు అనుసంధానంగా టీ నెక్ట్స్, టెరా చాట్‌బాట్ సేవలు అందుబాటులో వస్తాయని వివరించారు మంత్రి శ్రీధర్ బాబు. దీనిపై ఎల్‌అండ్‌టీ, టీజీ ట్రాన్స్‌కో, బీఎస్‌ఎన్‌ఎల్, ఎస్‌ఎస్‌ఏ పయనీర్ సంస్థలతో ఒప్పందం జరిగినట్టు తెలిపారు. ప్రస్తుతం నాలుగు గ్రామాల్లో నాలుగు వేల ఇళ్లకు టీఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలు వినియోగిస్తున్నారని వెల్లడించారు.
ALSO READ: ఈయన ఎవరో గుర్తు పట్టారా? మన మా మా మాస్
424 మండలాల్లోని 8,891 గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేస్తామన్నారు. వీటిలో 336 మండలాలు సిద్ధంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఆయా మండలాల్లోని దాదాపు 7 వేల గ్రామలు ఈ సేవలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.
అంతకుముందు టీ నెక్ట్స్, టీ ఫైబర్ కొత్త లోగో, వెబ్‌సైట్‌లను ప్రారంభించారు. అటు తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శ్రీధర్‌బాబు బాధ్యతలు చేపట్టారు. ఇకపై ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన అంశాలను స్వయంగా పరిశీలించనున్నారు మంత్రి. ఫైబర్ గ్రిడ్ పని వేగంగా అయ్యేలా అవకాశాలు లేకపోలేదు. పౌరులకు సాధికారత కల్పించడమే మా లక్ష్యమన్నారు.
ALSO READ: మీడియా చరిత్రలో సంచలనం.. స్వర్ణగిరి ఆలయంలో ‘బిగ్ టీవీ’ మెడికల్ క్యాంప్
Happy to inaugurate the new premises of T-FIBER and take charge as Chairman of Telangana Fiber Grid Corporation Limited. The innovation and progress showcased at the T-Fiber Experience Centre is truly impressive, highlighting the project's impact on governance, connectivity, and… pic.twitter.com/wQr3PmNbpR
— Sridhar Babu Duddilla (@OffDSB) April 10, 2025