Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పచ్చళ్లు.. ఇవి ఎంత ఫేమసో.. ధర కూడా అంతే ఉంటుంది. క్వాలిటీ పెరిగే కొద్దీ ధరలు కూడా పెరుగుతూ ఉంటాయని చెబుతున్నారు ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు ఈ పచ్చళ్ల బిజినెస్ ను ప్రారంభించి, అటు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అంతేకాదు వీరి పచ్చళ్ల కి మంచి డిమాండ్ కూడా ఉంది.. ముఖ్యంగా ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు కూడా.. అయితే వీరు ఇన్ని రోజులు ఎంతో కష్టపడి మంచి పేరు సొంతం చేసుకున్నారు.. కానీ ఇటీవల ప్రవర్తించిన తీరుకు ఒక్కసారిగా ఆ ఫేమ్ మొత్తం డౌన్ అయిపోయిందని చెప్పవచ్చు. సాధారణంగా వ్యాపారస్తులు ఎప్పుడూ కూడా కష్టంమరే దేవుడు అన్నట్టు భావిస్తూ ఉంటారు. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా.. ఎంత కష్టం వచ్చినా.. కష్టాల్లో ఉన్నా సరే కస్టమర్ మిమ్మల్ని ఏదైనా అడిగారు అంటే కచ్చితంగా ప్రశాంతంగా వారికి అనుకూలంగానే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ అలేఖ్య చిట్టి పచ్చళ్ల కు చెందిన అలేఖ్య కస్టమర్ తో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
కస్టమర్ పై బూతులతో రెచ్చిపోయిన అలేఖ్య..
అసలు విషయంలోకెళితే.. ఒక కస్టమర్ ఈ అలేఖ్య చిట్టి పికెల్స్ కు ఉన్న డిమాండ్ ను తెలుసుకొని తాను కూడా కొనుగోలు చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే అర కిలో పచ్చడి అడగగా.. ఏకంగా 1200 రూపాయలు చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయారు. అలేఖ్య చిట్టి పికెల్స్ అక్క చెల్లెళ్లలో ఒకరైన అలేఖ్య.. ఓ కస్టమర్ ధరలు ఎందుకు అంత ఎక్కువ అని అడిగినందుకు నానా బూతులు తిట్టింది. దీంతో అలేఖ్య అక్క సుమా స్పందించింది.
బూతులు మాట్లాడింది నా చెల్లే.. వివరణ ఇచ్చిన అలేఖ్య అక్క సుమ
ఇకపోతే ప్రముఖ ఛానల్స్ లో కూడా ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో అలేఖ్య సోదరి సుమ ఈ విషయంపై స్పందిస్తూ.. క్లారిటీ ఇస్తూ ఎమోషనల్ కూడా అయింది. సుమ తాజాగా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ.. అందులో ఈ విధంగా మాట్లాడింది.. సుమా మాట్లాడుతూ.. బూతులు తిట్టింది నా చెల్లె. కానీ అక్కడ ఏం జరిగింది..? ఎందుకు నా చెల్లి అలాంటి మాటలు అనాల్సి వచ్చింది అనే విషయం ఏది కూడా నాకు తెలియదు. సొంత అక్క చెల్లెళ్లు కదా ఆమాత్రం మీకు తెలియదా? అని మీరు ప్రశ్నించవచ్చు. నాకు పెళ్లయింది. నేను వేరొక చోట నా భర్తతో కలిసి జీవిస్తున్నాను.
ఈ విషయంపై నా చెల్లి కూడా నాతో మాట్లాడటం లేదు..
అయితే నా చెల్లికి సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేను కూడా నా చెల్లిపై కోపంతో అరిచేశాను. దాంతో నా చెల్లి నేను ఇప్పటికే డిప్రెషన్ లో ఉన్నాను. నువ్వు కూడా బాధపెట్టి నన్ను మరింత డిప్రెషన్ లోకి తోసేయకు. రెండు రోజులు పాటు దయచేసి నాతో మాట్లాడకు. అంటూ కాల్ కట్ చేసింది. ఇప్పటివరకు నా చెల్లి నాతో మాట్లాడలేదు. కనీసం ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. మేము క్వాలిటీ మైంటైన్ చేస్తాము. కాబట్టి ఆ రేంజ్ లో ధరలు ఉంటాయి. క్వాలిటీ విషయంలో మేము ఎక్కడ కూడా వెనకడుగు వెయ్యము. దయచేసి కష్టమర్లు కూడా అర్థం చేసుకుంటారని వేడుకుంటున్నాను.
నా భర్తను ఇన్వాల్వ్ చేయడం బాధగా ఉంది – సుమా
ఇక బూతులు తిట్టింది నా చెల్లె కానీ మేము అక్కాచెల్లెళ్లము కాబట్టి మమ్మల్ని అన్నా ఓకే పర్వాలేదు కానీ మధ్యలో నా భర్తను ఎందుకు లాగుతున్నారు. మా ఫోటోలను పెట్టడమే కాకుండా మా భర్త ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కళ్ళల్లో ఏదో ఫైర్ వచ్చినట్టు లేనిపోనివి సృష్టిస్తున్నారు. దయచేసి ఇలాంటివి ఆపండి అంటూ అలేఖ్య అక్క సుమా ఒక వీడియో ద్వారా వేడుకుంది. మరి ఈ వీడియోతోనైనా ఈ విషయం ఇక్కడితో ఆగిపోతుందేమో చూడాలి.
ALSO READ Alekhya Chitti Pickles: పచ్చళ్లు అమ్ముకోండి పర్వాలేదు.. ఆ పచ్చి బూతులు ఎందుకమ్మా?