ఆంధ్రప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఇంటి ఏసీలో ఏకంగా పదుల సంఖ్యలో పాములు పిల్లలు బయటపడ్డాయి. వాటిని చూసి ఇంటి సభ్యులు భయంతో వణికిపోయారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం కలిగించి, చుట్టుపక్కల వారికి తెలియడంతో చూసేందుకు ఎగబడ్డారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఫ్యామిలీ నివసిస్తోంది. ఆయన ఇంట్లో ఏసీ ఉంది. అయితే, చాలా కాలంగా ఈ ఏసీని పనడిపించడం లేదు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో మళ్లీ ఏసీని ఆన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఆన్ కాలేదు. ఏంటని దగ్గరికి వెళ్లి చూస్తే, ఓ పాము పిల్ల కనిపించింది. వెంటనే దాన్ని తీసి బయటపడేశాడు. కానీ, ఆ తర్వాత ఎందుకో డౌట్ వచ్చి పై కవర్ తీయగానే మరిన్ని పాములు కనిపించాయి. వెంటనే. స్నేక్ క్యాచర్ ను సమాచారం ఇచ్చాడు సత్యనారాయణ. ఆయన వచ్చి ఏసీ కవర్ ఓపెన్ చేయగానే పదుల సంఖ్యలో పాము పిల్లలు కనిపించాయి. వాటన్నింటినీ ఓ కవర్ వేసి తీసుకెళ్లాడు. పాము పిల్లలను చూసి ఇంట్లో వాళ్లు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసేందుకు ఎగబడ్డారు. పాము వచ్చి, ఏసీలో ఎలా గుడ్లు పెట్టిందా? అని ఆలోచిస్తున్నారు.
కొంతకాలంగా ఏసీ పని చేయకపోవడంతో..
గత కొద్ది నెలలుగా ఏసీని వాడకపోవడం వల్ల అందులో పాము వచ్చి గుడ్లు పెట్టినట్లు భావిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. “గత కొద్ది నెలలుగా ఏసీని వాడటం లేదు. గత వేసవిలో దానిని ఉపయోగించాం. ఆ తర్వాత వాడటం మానేశాం. మళ్లీ సమ్మర్ వస్తుండటంతో ఆన్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ, కాలేదు. ఏంటని చూడగా, అందులో పాము పిల్లలు కనిపించాయి. వెంటనే స్నేక్ క్యాచర్ ను పిలిపించాను. కిరణ్ అనే స్నేక్ క్యాచర్ వచ్చాడు. ఏసీని ఓపెన్ చేయడంతో చాలా పాము పిల్లలు బయటపడ్డాయి. ఏసీ ఉపయోగంలో లేకపోవడం వల్లే, అందులోకి పాము చొరబడి గుడ్లు పెట్టి ఉంటుందని భావిస్తున్నాం. అయినా, ఇంట్లోకి పాము రావడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది” అని చెప్పుకొచ్చారు.
Read Also: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని బైకులకు నిప్పు, మరీ ఇంత ఘోరమా?
అటు ఈ ఘటనపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఏసీలోకి పాము వచ్చి గుడ్లు పెట్టిందంటే ఇంట్లో వాళ్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం అవుతోందంటున్నారు. ఏసీ వాడే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా ఏసీని చెక్ చేస్తూ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్లు మరింతగా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఏసీ పైపుల ద్వారా కూడా పాములు లోపలికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలా వచ్చేందుకు వీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read Also: మహిళను కారుతో ఢీకొట్టి, కిలో మీటరు ఈడ్చుకెళ్లి.. హర్యానాలో ఘోరం!
Read Also: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని బైకులకు నిప్పు, మరీ ఇంత ఘోరమా?