IRE – AFG: మంగళవారం రోజు ఐర్లాండ్ క్రికెట్ బోర్డ్ ఈ ఏడాది జరిగే తమ అంతర్జాతీయ మ్యాచ్ ల షెడ్యూల్ ని విడుదల చేసింది. ఇందులో ఏప్రిల్ 19 నుండి 18 మధ్య పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, థాయిలాండ్ మరియు స్కాట్లాండ్లతో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచులు ఉన్నాయి. ఐర్లాండ్ మహిళా జట్టు ఏప్రిల్ 5 అలాగే 7వ తేదీలలో పాకిస్తాన్ లో వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లతో జరిగే వార్మప్ మ్యాచ్ ల జాబితాని కూడా సిద్ధం చేసింది.
Also Read: WPL 2025: ఫైనల్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్..ఈ సారి కప్పు కొట్టేనా?
కానీ క్వాలిఫైయర్స్ మ్యాచ్లకు మాత్రం వేదికలను, తేదీలను ఐసీసీ ఇంకా విడుదల చేయలేదు. ఇక ఐర్లాండ్ పురుషుల జట్టు మే, జూన్ నెలలలో వరుసగా వెస్టిండీస్ తో వన్డే మరియు టి-20 సిరీస్ లను ఆడబోతుంది. అలాగే ఇంగ్లాండ్ పురుషుల జట్టు సెప్టెంబర్ లో ఐర్లాండ్ లో తమ తొలి టి-20 సిరీస్ ని ఆడబోతోంది. ఇందులో మూడు టి-20 మ్యాచ్ లు ఉన్నాయి.
అయితే పురుషుల జట్టు షెడ్యూల్ ప్రకారం ఐర్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ తో ఒక టెస్ట్ తో పాటు మూడు వన్డేలు, మూడు టి-20 లు ఆడాల్సి ఉంది. కానీ ఈ ఏడు మ్యాచ్లను పూర్తిగా రద్దు చేశారు. ఈ విషయం గురించి ఐర్లాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారెన్ డ్యూట్రోమ్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్లను రద్దు చేసింది రాజకీయ కారణాల వల్ల కాదని, ఆర్థిక కారణాలవల్ల అని తెలిపారు. డబ్బులు లేని కారణంగానే ఐర్లాండ్ – ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే సిరీస్ ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
2017లో ఐసీసీ లో పూర్తి సభ్యత్వం పొందినప్పటి నుండి ఐర్లాండ్ ఆడిన 10 టెస్ట్లలో రెండింటికి మాత్రమే స్వదేశంలో ఆతిథ్యం ఇచ్చింది. 2024లో యూఏఈ లో ఆఫ్ఘనిస్తాన్ పై తొలి విజయాన్ని సాధించింది ఐర్లాండ్. ఆ తర్వాత 2024లో స్వదేశంలో జింబాబ్వేపై మరో రెండు టెస్ట్ మ్యాచ్లను గెలుచుకుంది. అయితే శాశ్వత హోమ్ గ్రౌండ్ లేకపోవడం, మౌలిక సదుపాయాలకు అధికవ్యయం దృశ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పూర్తి ఏడాది ఐర్లాండ్ పురుషుల జట్టు షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే..
Also Read: Jio Hotstar – IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్ కు జియో అదిరిపోయే శుభవార్త.. ఇకపై రూ.100 లకే
మే 21: ఐర్లాండ్ v వెస్టిండీస్ (1వ వన్డే; క్లోంటార్ఫ్)
మే 23: ఐర్లాండ్ v వెస్టిండీస్ (2వ వన్డే; క్లోంటార్ఫ్)
మే 25: ఐర్లాండ్ v వెస్టిండీస్ (3వ వన్డే; క్లోంటార్ఫ్)
జూన్ 12: ఐర్లాండ్ v వెస్టిండీస్ (1వ T20I; బ్రెడీ)
జూన్ 14: ఐర్లాండ్ v వెస్టిండీస్ (2వ T20I; బ్రెడీ)
జూన్ 15: ఐర్లాండ్ v వెస్టిండీస్ (3వ T20I; బ్రెడీ)
సెప్టెంబర్ 17: ఐర్లాండ్ v ఇంగ్లాండ్ (1వ T20I మలహైడ్)
సెప్టెంబర్ 19: ఐర్లాండ్ v ఇంగ్లాండ్ (2వ T20I; మలహైడ్)
సెప్టెంబర్ 21: ఐర్లాండ్ v ఇంగ్లాండ్ (3వ T20I; మలహైడ్).