Watch video: హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మనాలీలో జరిగిన ఓ దారుణ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హరియాణా రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబానికి, స్థానికులతో జరిగిన చిన్న వాగ్వాదం పెద్ద గొడవకు దారి తీసింది. ఈ ఘటనలో నాలుగు నెలల శిశువు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా పర్యాటకుల భద్రతపై భరోసా ఏదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం.
హరియాణా రాష్ట్రం, మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన ప్రదీప్ (35) తన భార్య దీపిక (28), నాలుగు నెలల కుమార్తె జియా, సోదరుడు గోపాల్, సోదరి నిషా, బంధువులు జైనేంద్ర (36), ఆశాతో కలిసి మనాలీలో విహారయాత్రకు వచ్చారు. అయితే.. అక్కడ స్కూటీ పార్కింగ్ కు సంబంధించి స్థానికులతో జరిగిన చిన్న వివాదం పెద్ద గొడవకు దారి తీసింది. స్థానిక యువకులు పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో మహిళతో పాటు తన నాలుగు నెలల శిశువును నేలపై పడిపోయారు. దీంతో నాలుగు నెలల పసిపాపకు తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది.
Went to Manali for memories,
Came back with scars.
No safety, no help, felt worse than Pakistan.
– Tourist beaten with family pic.twitter.com/hgnIvvjcfv— Mohd Shadab Khan (@VoxShadabKhan) June 24, 2025
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో, బాధితుడు ప్రదీప్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ‘మనాలీ పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది. ఇక్కడికి ఎవరూ రావొద్దు. టూరిస్టులకు అసలు భద్రతే లేదు’ అని తన బాధను వ్యక్తపరిచాడు. పోలీసులను రెండు సార్లు సంప్రదించినా తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మనాలీలో పర్యాటక భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: UPSC: యూపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైనే వేతనం.. మరి కొన్ని రోజులే..!
బాధిత కుటుంబం మనాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 126(2), 115(2), 352, 351(2), 3(5) కింద నిందితులపై కేసు నమోదైంది. ఈ దాడిలో కులవివక్ష ఆరోపణలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ దర్యాప్తును పోలీస్ ఆఫీసర్ మనోజ్ నేగి నిర్వహిస్తున్నారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు బాధితులకు భరోసా నిచ్చారు.
ALSO READ: RRB: ఇది అద్భుతమైన అవకాశం.. రైల్వేలో డిగ్రీతో భారీగా ఉద్యోగాలు, ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ బ్రో
ఈ ఘటన మనాలీ వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో భద్రతా లోపాలను బయటపెట్టింది. ఈ ఘటన వల్ల భారీగా పర్యాటకులు వచ్చే సమయంలో ఇటువంటి ఘటనలు స్థానిక పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల భద్రత కోసం అధికారులు మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.