Viral Video: బీజేపీ నాయకుడు అతీఖ్ పఠాన్ రోడ్డు మధ్యలో ఓ మహిళ, ఆమె కుమారుడిని చెప్పుతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ వినియోగదారులు ఆ నాయకుడి చర్యను తప్పుబట్టారు. ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. అసలేం జరిగింది?
యూపీలోని గ్రేటర్ నొయిడా ప్రాంతంలోని దంకౌర్ ప్రాంతంలో అస్సాంకు చెందిన సకినా అనే మహిళ గడిచిన 15 సంవత్సరాలుగా నివసిస్తోంది. రోజువారీ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. విద్యుత్ వైర్లు విషయంలో పొరుగునున్న మరో మహిళతో వివాదం మొదలైంది.
వారి మధ్య గొడవ జరుగుతుండగానే బీజేపీ నాయకుడు అతీఖ్ పఠాన్ ఎంట్రీ ఇచ్చాడు. పరిస్థితిని శాంతింప జేయాల్సిందిపోయి ఆయన కొట్టడం మొదలుపెట్టాడు. సకీనా కుమారుడు సఫీకుర్రహ్మాన్‌ను చెప్పుతో కొట్టడం మొదలుపెట్టాడు. తన కొడుకును రక్షించడానికి ప్రయత్నించినప్పుడు బీజేపీ నాయకుడు వారిద్దరినీ చెప్పుతో కొట్డాడు.
అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు యువకులు తమ ఫోన్లకు పని చెప్పారు. ఆ గొడవకు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడది వైరల్ అయ్యింది. ఆ వీడియోపై ప్రజల నుండి తీవ్రమైన విమర్శలు మొదలయ్యాయి. బీజేపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: మహిళ గొంతు చీల్చుకుని బయటకు వచ్చిన చేప ముల్లు
చివరకు ఆ వీడియో వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లింది. దాడికి సంబంధించి ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బీజేపీ నాయకులు రియాక్ట్ అయ్యారు. రెండు వర్గాల మధ్య వివాదమని, వారిలో ఒకరు సహాయం కోసం బీజేపీ నేతను సంప్రదించారని అన్నారు.
అతిక్ ప్రశ్నించడానికి ప్రయత్నించినప్పుడు ఇంకో వ్యక్తి పారిపోయాడని, అతడ్ని బీజేపీ నాయకుడు పట్టుకున్నారని చెప్పుకొచ్చారు. అప్పటి నుండి ఈ విషయాన్ని ఇరు వర్గాలు పరిష్కరించుకునే పడ్డాయని స్థానిక నేతలు తెలిపారు.
ग्रेटर नोएडा में BJP नेता ने मां-बेटे को सरेआम चप्पलों से पीटा, वीडियो वायरल होने पर गिरफ्तार !!
ग्रेटर नोएडा के पास दनकौर के बिलासपुर कस्बे में भाजपा के एक नेता ने महिला और उसके बेटे को सरेआम चप्पल से पीटा !!
इस घटना का वीडियो सोमवार को सोशल मीडिया पर वायरल हुआ तो पुलिस ने… pic.twitter.com/RfjEzeKAax
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) July 1, 2025