Indian Stranded In Gulf For 42 Years| బతురుతెరువు కోసం.. ఉన్న ఊరు, కుటుంబాన్ని వదిలి సుదూర ప్రాంతాలకు చాలమంది వెళుతూ ఉంటారు. కేవలం తమ కుటుంబం ఆర్థికంగా బాగుండాలని భావించి వారు తమ జీవితంలోని సింహభాగం అక్కడే గడిపేస్తారు. ఎప్పుడో ఏడాదికోసారి వచ్చి తిరిగి వెళ్లిపోతారు. భారతీయుల్లో కూడా చాలామంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు ఇలా ఉద్యోగం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళుతుంటారు. అలా వెళ్లిన ఒక భారతీయుడు విధి వక్రీకరించడంతో అక్కడే 42 ఏళ్లుగా చిక్కుకుపోయాడు.
తాను ఏ తప్పు చేయకపోయినా ఆ దేశంలో చట్టాల కారణంగా నిర్బంధించబడ్డాడు. అతని కోసం ప్రాణాలు చేతబట్టుకొని ఓ తల్లి 95 ఏళ్ల వయసులో కూడా తన కొడుకు తిరిగి వస్తాడని ఎదురు చూస్తోంది. ఇటీవలే ఆమె కొడుకు కు ఒక సామాజిక సంస్థ ద్వారా విముక్తి లభించింది. కానీ అతను ఇంకా భారతదేశం చేరుకోలేదు. కేరళకు చెందిన గోపాలన చంద్రన్ అనే వ్యక్తి కథ ఇది.
కేరళలోని త్రివేడ్రమ్ నగరం పౌడీకోణం అనే చిన్న గ్రామానికి చెందిన గోపాలన్ చంద్రన్ ఒక పేద కుటుంబానికి చెందిన వాడు. అందుకే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ఏదైనా ఉద్యోగం కోసం ఎదురు చేస్తుండగా.. అతని స్నేహితులు కొందరు గల్ఫ దేశాలకు వెళ్లి బాగా సంపాదిస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో తాను కూడా గల్ఫ్ దేశంలో ఉద్యోగం చేస్తానని చెప్పి 1983 ఆగస్టు 16న బహ్రెయిన్ దేశం వెళ్లాడు. అక్కడికి వెళ్లాక మిగతా వలస దారుల లా అతను కూడా బాగా సంపాదించి తన కుటుంబాన్ని బాగా పోషించాలనుకున్నాడు. కానీ వెళ్లిన కొన్ని రోజులకే అతని ఆశలు ఆవిరయ్యాయి. అతను కన్న కలలు చెదిరిపోయాయి.
బహ్రెయిన్‌లో తప్పిపోయి
ఒక రోజు తన యజమానితో ప్రయాణంలో ఉన్న గోపాలన్ కు దురదృష్టం ఎదురైంది. అతని యజమాని అనుకోకుండా గుండెపోటుతో మరణించాడు. దీంతో అక్కడ అరబి భాష తెలియని గోపాలన్ నిర్మానుష ప్రాంతంలో సాయం కోసం నలువైపులా తిరుగుతూ దారి తప్పి పోయాడు. కొన్ని రోజుల తరువాత అక్కడ పోలీసులకు దీనావస్థలో దొరికాడు. పోలీసులు అతడు భారతదేశం లేదా శ్రీలంక జాతీయుడని భావించి ఇమ్మిగ్రేషన్ అధికారులక అప్పజెప్పారు. కానీ అరభి భాష తెలియని గోపాలన్ తన యజమాని పేరు చెప్పలేకపోయాడు. పైగా అతని వద్ద పాస్ పోర్ట్ లాంటి ఇతర ధృవీకరణ పత్రాలు కూడా లేవు. దీంతో అతడి గుర్తింపు తెలియక బహ్రెయిన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని యజామానుల నుంచి పారిపోయిన వాడిగా ముద్రవేసి జైల్లో పెట్టారు. అలా 42 ఏళ్లుగా ఆ జైల్లోనే గోపాలన్ మగ్గిపోయాడు.
మరోవైపు కేరళలో అతని తల్లి తన కొడుకు ఏమయ్యాడో తెలియక విలవిల్లాడుతూ ఎదురు చూస్తోంది. కానీ అనుకోకుండా బహ్రెయిన్ లో భారతీయులకు చెందిన ప్రవాసి లీగల్ సెల్ అనే ఎన్జీవో సభ్యులకు గోపాలన్ గురించి తెలిసింది. ఈ ఎన్జీవోని సమాజ సేవ కోసం ఇండియన్ లాయర్లు నడుపుతున్నారు. గోపాలన్ గురించి ఆరా తీసి అతడు భారతీయుడని ఇండియన్ ఎంబసీ నుంచి పత్రాలను సాధించి జైలు నుంచి విముక్తి అయ్యేందుకు సాయం చేశారు.
Also Read: రైలు నుంచి విసిరిన వాటర్ బాటిల్ తగిలి బాలుడు మృతి.. లోకో పైలట్‌పై కేసు
గోపాలన్ కథ గురించి ప్రవాసి లీగల్ సెల్ బహ్రెయిన్ చాప్టర్ అధ్యక్షుడు సుధీర్ తిరునిలాత్ మాట్లాడుతూ.. “అధికారుల నిర్లక్ష్యం వల్ల గోపాలన్ తన జీవితంలోని ముఖ్య భాగాన్ని జైల్లో గడపాల్సి వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. గోపాలన్ చంద్రన్ కు ఇప్పుడు 72 సంత్సరాలు. అతడిని చూడడానికి అతని 95 ఏళ్ల తల్లి ఎదురుచూస్తోంది. ఈ రోజే గోపాలన్ కు భారతదేశానికి పంపుతున్నాం. ఇక్కడి నుంచి గోపాలన్ కన్నీళ్లు తప్ప ఏమీ తీసుకెళ్లడం లేదు. అతడి కుటుంబంతో కలిసి అతడు మిగతా జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాం. గోపాలన్ లాగా ఇక్కడ చాలా సమయంలో చిక్కుకున్న భారతీయులకు సాయం చేసేందుకు మేము కృషి చేస్తున్నాం” అని అన్నారు.