UK Student Virginity Sale: ఈ రోజుల్లో మనుషుల ఆలోచనులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. మరీ ముఖ్యంగా యువత గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. డేటింగ్, లవ్, ఫ్రెండ్షిప్ అంటూ ఒక్కక్కరు వేసే వేశాలు చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేయడం చూశాం. ఇకపై ఆన్ లైన్ ద్వారా అమ్మాయి కన్యత్వాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అమ్మాయిల కన్యత్వాన్ని ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. యుకెకు చెందిన ఓ 22 ఏళ్ల యువతి తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. ఆమెను దక్కించుకునేందుకు ఎంతో మంది ప్రమఖులు పోటీ పడ్డారు. ఒకరిని తలదన్నేలా మరొకరు ధర పెట్టారు. చివరకు ఆమె కన్యత్వం కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయింది. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.
వెబ్ సైట్ వేదికగా కన్యత్వానికి బిడ్డింగ్..
మాంచెస్టర్ కు చెందిన లారా అనే విద్యార్థిని ప్రముఖ ఎస్కార్ట్ ఏజెన్సీ సిండ్రెల్లా వెబ్ సైట్ ద్వారా తన కన్యత్వానికి వేలం నిర్వహించారు. ఈ విషయం తెలియడంతో ఎంతో మంది ఆమెను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. యువతతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలో బిడ్లు వేశారు. ధర ఒకరికి మించి ఒకరు పెట్టడంతో కోట్లాది రూపాయలకు చేరింది. చివరకు లాస్ ఏంజిల్స్ కు చెందిన హాలీవుడ్ నటుడు ఆమె కన్యత్వాన్ని సుమారు £1.7 మిలియన్లకు కొనుగోలు చేశారు. ఇది మన కరెన్సీలో రూ.18 కోట్లకు సమానం. ఆ తర్వాత ఆమె కన్యత్వాన్ని ఓ డాక్టర్ నిర్ధారించారట.
🚨 SHOCKING NEWS: A 22-year-old student from Manchester, UK, named Laura sold her virginity for ₹18 crore through an online auction. The auction attracted interest from high-profile politicians, businessmen, and celebrities, with the highest bid coming from a Hollywood star.#UK pic.twitter.com/zo8ys0hk5p
— The Ananta (@theanantaindia) March 12, 2025
కన్యత్వం అమ్మకంపై లారా ఏమన్నదంటే?
తన కన్యత్వాన్ని ఆన్ లైన్ వేదికగా అమ్మడం గురించి లారా స్పందించింది. ఈ వేలం పట్ల తనకు ఎలాంటి భాద, సిగ్గు అనేది కలగలేదని చెప్పింది. ఆర్థికంగా ఎదిగేందుకు ఇదో బెస్ట్ ఆప్షన్ గా కనిపించినట్లు వెల్లడించింది. కొంత మంది అమ్మాయిలు ఎలాంటి లాభం లేకుండా తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారని, తాను మాత్రం అలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చింది. తన భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తన తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని వివరించింది.
లారా నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా జోరుగా చర్చ
అటు లారా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంత మంది ఆమె నిర్ణయాన్ని మెచ్చుకుంటే, మరికొంత మంది తిట్టిపోస్తున్నారు. ఈ రోజుల్లో ఎంతో మంది అమ్మాయిలు పెళ్లికి ముందే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారని.. లారా తన భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం తప్పులేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది అమ్మాయిలంతా ఇలాగే చేసుకుంటూ వెళ్తే మున్ముందుకు ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఈ రోజుల్లో ఆడ పిల్లలు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: గుట్కా ఉమ్ములతో ఎర్రబడ్డ ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో చెప్పుకోండి.. బీహార్ కాదు!