BigTV English

snake in temple: అద్భుతం.. శివలింగాన్ని చుట్టుకుని.. బుసలు కొట్టిన నాగుపాము, వీడియో చూశారా?

snake in temple: అద్భుతం.. శివలింగాన్ని చుట్టుకుని.. బుసలు కొట్టిన నాగుపాము, వీడియో చూశారా?

snake in temple: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా హవా మామూలుగా లేదు. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కామెడీ వీడియో, జంతువుల వీడియోలు తెగ షేర్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఈ వీడియోలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇక పాముల వీడియోలకు అయితే నిమిషాల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అనకొండ, కొండచిలువ, నాగుపాములు, ర్యాట్ స్నేక్ లకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని నర్మదేశ్వర్ మహాదేవ్ ఆలయంలో పవిత్రమైన శ్రావణ మాసంలో అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. నాగుపాము ఆలయంలోని శివలింగాన్ని చుట్టుకొని.. దాదాపు సుమారు 20 నిమిషాల పాటు అక్కడే శాంతంగా ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మస్త్ వైరల్ గామారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల తెలుసుకుందాం.


శివలింగంపై పాము ప్రత్యక్షం..

నర్మదేశ్వర్ మహాదేవ్ ఆలయ సమీపంలో పాములు ఆడించే ఓ వ్యక్తి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో అటు వైపు వెళ్తున్న భక్తులు పాములను ఆడించమని కోరారు. దీంతో అతను పాముల బుట్ట తెరిచాడు. దానిలో ఒక పాము వెంటనే అక్కడ నుంచి వేగంగా బయటకు వెళ్లింది. అద్భుతమైమన విషయం ఏంటంటే.. ఆలయ గర్భగుడిలోని శివలింగం వద్దకు పాము వెళ్లింది. ఆ పాము శివలింగాన్ని చుట్టుకొని, కొన్ని నిమిషాల పాటు అక్కడే ఉండిపోయింది. ఈ అత్యద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొందరు దీనిని దైవిక సంకేతంగా భావించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మరికొందరు పామును చూసి భయబ్రాంతులకు గురయ్యారు. అయినప్పటికీ, ఆలయంలోని ఎలాంటి ఆటంకం లేకుండా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.


ఇది నిజంగా అద్భుతం..

ఈ వీడియోను అక్కడున్న యువత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.. వేలల్లో లైకులు, కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. శివుడికి అత్యంత పవిత్రమైన శ్రావణ మాసంలో ఈ సంఘటన భక్తులకు దైవిక అనుభూతిని అందించిందని కామెంట్ చేస్తున్నారు. ‘ఇది నిజంగా అద్భుతం’ అని మరికొందరు రాసుకొచ్చారు. శివలింగంపై పాము చుట్టుకోవడం శివుని సన్నిధిలో పాము ప్రతీకాత్మకతతో ముడిపడి ఉందని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే శివుడు తన కంఠంలో పామును ధరిస్తాడని పురాణాలు చెబుతాయి.

ఇదిగో వీడియో చూసేయండి..

?utm_source=ig_web_copy_link

అయితే, ఆలయంలో పూజలకు ఆటంకం కలగకుండా భక్తుల భద్రత కోసం, పాములను ఆడించే వ్యక్తి ఆ సర్పాన్ని జాగ్రత్తగా శివలింగం నుండి తొలగించి, తిరిగి తన బుట్టలో వేసుకున్నాడు. ఈ సంఘటన ఆలయంలో ఒక అద్భుతమైన జ్ఞాపికగా నిలిచిపోయింది. భక్తుల మనస్సులో శివుని దైవత్వం, పాము ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుంది.

Related News

Free Condoms: ఈ రెస్టారెంట్ లో ఎటు చూసినా కండోమ్సే, ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్లొచ్చు!

Kim Jong Un: ఐస్ క్రీమ్ అనకూడదా? ఇంగ్లీష్ పదాలపై కిమ్ మామ ఆంక్షలు, ఆ పదాలన్నీ బ్యాన్!

Printed Pillars: రంగులే.. రంగులే.. హైదరాబాద్ పిల్లర్లపై క్రీడా దిగ్గజాల పెయింటింగ్స్, అదుర్స్ అంతే!

Restaurant: రెస్టారెంట్‌లో టీనేజర్ల అసభ్య ప్రవర్తన.. కస్టమర్లు షాక్, పేరెంట్స్ భారీగా జరిమానా

Chicken Leg Thief: పెళ్లిలో చికెన్ లెగ్ పీస్ చోరీ.. పర్సులో దాచిన అతిథి

Viral video: మైనర్ బాలికను వేధించాడు.. గ్రామస్థులు కిందపడేసి పొట్టుపొట్టు..? వీడియో మస్త్ వైరల్

Viral video: దారుణ ఘటన.. భార్యను కట్టేసి.. బెల్టుతో కొడుతూ పైశాచిక ఆనందం..!

Viral Video: ఒకే వ్యక్తితో తల్లి, కూతురు సంబంధం.. ఒకేసారి గర్భం కూడా, ఛీ పాడు!

Big Stories

×